Begin typing your search above and press return to search.
హైకోర్టు లో ఎస్ఈసీ నీలం సాహ్నికి ఊరట.. పిల్ వెనక్కి తీసుకున్న పిటిషనర్ , ఎందుకంటే
By: Tupaki Desk | 24 Jun 2021 9:09 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు లో వేసిన పిటిషన్ ను వెనుకకి తీసుకున్నారు. ఈ పిటిషన్ కు సంబంధించి పూర్తి పత్రాలు లేకపోవడంతో పిటిషన్ ను ఉపసంహరణ చేసుకుంటున్నట్లు పిటిసనర్ మూర్తి కోర్టుకి తెలియజేశారు.పూర్తి పత్రాలతో మరోసారి వ్యాజ్యం దాఖలుకు పిటిషనర్ అనుమతి కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించి..పిటిషన్‌ని డిస్పోజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అయితే , ఎస్ ఈసీ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియగానే మాజీ చీఫ్ సెక్రటరీ గా పని చేసిన నీలంసాహ్నిని ప్రభుత్వం ఎస్ ఈ సీగా అపాయింట్ చేసింది. ఆ తర్వాత ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి వారం రోజుల్లోనే ఎన్నికలను కూడా జరిపించారు. అయితే, దీనిపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాగా, ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకంది. ఇది ఇలా ఉండగా, నీలంసాహ్ని ఎన్నికల కమిషనర్ గా నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.అయితే పిటిషన్ లో సరైన పత్రాలు లేనందును దానిని ఈ రోజు పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని, ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు.
అంతకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు నీలం సాహ్నీ. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా, టెక్కలి సబ్ కలెక్టర్ గా, నల్గొండ జేసీగా పనిచేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కుటుంబ సంక్షేమ శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విమరణ పొందారు. అయితే, ఈ తరుణంలోనే అనుకోని విధంగా అనూహ్యంగా ఎస్‌ఈసీగా నియమించడం విశేషం.