Begin typing your search above and press return to search.

గోల్డ్ మెడల్ ను ఆ వ్యక్తికి అంకితమిచ్చిన నీరజ్ చోప్రా

By:  Tupaki Desk   |   8 Aug 2021 10:18 AM GMT
గోల్డ్ మెడల్ ను ఆ వ్యక్తికి అంకితమిచ్చిన నీరజ్ చోప్రా
X
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్ లో శతాబ్ధం తర్వాత భారత్ కు తొలి పతకం అందించాడు. టోక్యో ఒలింపిక్స్ 2020 జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సర్ణ పతకం గెలిచి కోట్లాది భారతీయుల ఆశలు నెరవేర్చాడు.

అయితే తన గోల్డ్ మెడల్ ను భారత క్రీడా దిగ్గజం మిల్కాసింగ్కు అంకితమిస్తున్నట్టుగా తాజాగా నీరజ్ చోప్రా ప్రకటించారు. దిగ్గజం మిల్కాసింగ్ ఒలింపిక్స్ లో భారత జాతీయ గీతాన్ని వినాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన మనతో లేరు. కానీ మిల్కా సింగ్ కల మాత్రం నెరవేరింది. నేను ఈ మెడల్ ను మిల్కాసింగ్ కు అంకిత ఇస్తున్నా.. ఆయన ఎక్కడ ఉన్నా.. నన్న గమనిస్తున్నారని’ నీరజ్ చోప్రా ఎమోషనల్ అయ్యారు.

తాను అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం వల్ల ఫైనల్స్ లో ఒత్తిడికి గురికాలేదని నీరజ్ చోప్రా అన్నాడు. తొలి త్రోలో 87.03 మీటర్లు వెళుతుందని అనుకున్నా.. త్రో తర్వాత ఒలింపిక్స్ రికార్డు 90.57 మీటర్లు అని భావించా.. నా బెస్ట్ రికార్డ్ 88.07 మీటర్లు. తదుపరి లక్ష్యం 90 మీటర్లు దాటాలని పెట్టుకున్నా.. ఈ టోర్నీకి ప్రిపేర్ కావడానికిఏడాది సమయం దొరికిందని భావించానని చెప్పాడు నీరజ్ చోప్రా.

మిల్కా సింగ్ రెండు నెలల క్రితం కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మిల్కా ఆసియా అథ్లెటిక్స్ లో నాలుగు సార్లు స్వర్ణం సాధించాడు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగులో తృటిలో పతకం కోల్పోయాడు.