Begin typing your search above and press return to search.
సముద్రం లో నీరజ్ చోప్రా జావెలి ప్రాక్టీస్ .. వీడియో వైరల్
By: Tupaki Desk | 2 Oct 2021 11:30 AM GMTతాజాగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ ను గెలుచుకొని దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. దాదాపు వందేళ్ల తర్వాత భారత్ కు అథ్లెట్స్‌లో పతకాన్ని అందించిన నీరజ్ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది . ప్రాంతాలతో సంబంధం లేకుండా నీరజ్‌ను దేశ ప్రజలంతా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఆటపై తనకున్న ఇష్టం, కష్టపడే తత్త్వమే ఆయనను దేశం మెచ్చే ఆటగాడిగా మార్చాయి. గతంలో నీరజ్ చోప్రా ప్రాక్టిసింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న మరో వీడియో గేమ్‌పై నీరజ్‌కు ఉన్న ఇష్టం ఎలాంటిదో చాటి చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. నీరజ్ చోప్రా ప్రస్తుతం హాలీడేలో ఉన్నాడు. ఇందులో భాగంగా మాల్దీవుల్లో జాలీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నీరజ్ సముద్రం అడుగున స్కూబా డైవింగ్ చేశాడు. ఇందులో భాగంగా తీసిన వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే వీడియో తీస్తున్న సమయంలో సముద్రం అడుగున కూడా నీరజ్.. బల్లెం విసిరినట్లు చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'ఆకాశంలో.. నేలపై.. చివరికి నీటి అడుగున కూడా నేను ఎల్లప్పుడూ జావెలిన్ త్రో గురించే ఆలోచిస్తాను. నా శిక్షణ మళ్లీ మొదలైంది' అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్టు ప్రకటించింది. బహుళ సంత్స రాల బ్రాండ్ భాగస్వామ్యంగా దీన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.