Begin typing your search above and press return to search.
ఒలింపిక్స్: తొలి గోల్డ్ మెడల్.. నీరజ్ చోప్రా సంచలనం
By: Tupaki Desk | 7 Aug 2021 1:02 PM GMTఒలింపిక్స్ లో భారతదేశం వందేళ్ల కల నెరవేరింది. అథ్లెటిక్స్ లో తొలిసారి పతకం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఏకంగా గోల్డ్ మెడల్ గెలిచి, యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచాడు. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన ఇండియన్ అథ్లెట్ గా రికార్డులకెక్కాడు. జావెలిన్ త్రోలో ప్రత్యర్థులెవరూ నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు. మొదటి అవకాశంలోనే 87.03 మీటర్ల దూరం ఈటె విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆ తర్వాత రెండో అవకాశంలో మరింత మెరుగ్గా 87.53 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో 76.79 మీటర్లకు పరిమితం అయ్యడు. ఆ తర్వాత రెండుసార్లు ఫౌల్స్ పడ్డాయి. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. పోటీలో ఉన్న ఆటగాళ్లందరికీ ఆరు అవకాశాలు ఉంటాయి. అందులో అత్యుత్తమ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారు. ఇలా అందరిలోనూ అత్యధిక దూరం జావెలిన్ విసిరింది మన నీరజ్ చోప్రానే. ఏకంగా 87.53 మీటర్లు విసిరిన ఆటగాడిగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.
ఇక చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకూబ్ (86.67 మీటర్లు)కు రజతం దక్కింది. అదే దేశానికి చెందిన మరో అథ్లెట్ విటెడ్జ్ స్లావ్ (85.44 మీటర్లు) కాంస్యం గెలిచాడు. నీరజ్ చోప్రా గోల్డ్ గెలవడంతో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. టోక్యో భారత్ కు స్వర్ణం అందించిన ఒకే ఒక్కడు అంటూ దేశప్రజలంతా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా హర్యానాలో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హర్యానా హోంమంత్రి అనిల్ టీవీ చూస్తూ డాన్స్ చేశారు. వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన రెండో భారతీయుడిగానూ రికార్డులకెక్కాడు నీరజ్ చోప్రా.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణపతకం సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు గోల్డ్ మెడల్ రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారతమాత మెడలో బంగారం పతకాన్ని వేశాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు వచ్చాయి. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ వచ్చింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకి రజతం, రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా రజత పతకాలు గెలిచారు. ఇక బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా, పురుషుల హాకీ జట్టు, రెజ్లింగ్‌లో బజ్‌రంగ్ పునియా కాంస్య పతకాలను గెలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలను సాధించగా.. ఆ రికార్డను ఈసారి అధిగమించింది భారత్. ఈసారి టోక్యోలో భారత్ పోటీ ప్రారంభమైన రోజే మీరాబాయి చాను రజతం గెలవగా.. ముగింపు రోజున స్వర్ణం గెలిచాడు నీరజ్ చోప్రా.
ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టోక్యోలో సరికొత్త చరిత్ర లిఖించబడింది అంటూ వ్యాఖ్యానించిన మోదీ.. ‘ఈరోజు సాధించిన ఘనత ఎప్పటికీ గుర్తిండిపోతుంది. యువ ఆటగాడు నీరజ్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. స్వర్ణం గెలుచుకున్నందుకు నీరజ్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.