Begin typing your search above and press return to search.
మరే క్రీడాకారుడికి దక్కని గౌరవం నీరజ్ చోప్రా సొంతమైంది
By: Tupaki Desk | 11 Aug 2021 2:46 AM GMTగెలుపునకు మించిన కిక్ ఏముంటుంది చెప్పండి. దేశంలో క్రీడలు ఎన్నో ఉన్నా.. క్రికెట్ ను ఆదరించినంతగా.. అభిమానించినంతగా మరే క్రీడ మీదా ప్రేమను చూపించలేరు. క్రికెట్ ఒక మతంలా మారిన మన దేశంలో.. జావెలిన్ త్రోలో దేశానికి బంగారు పతకాన్ని తీసుకురావటం ద్వారా వందేళ్లకు పైగా ఎవరూ సాధించలేనిది సాధించాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలంపిక్స్ లో సాధించిన స్వర్ణ పతకంతో గోల్డెన్ బాయ్ గా మారిన అతడికి.. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దేశంలో ఎంతో మంది ప్రముఖ క్రీడాకారులున్నా.. వారెవరికి దక్కని అరుదైన గౌరవం తాజాగా నీరజ్ సొంతమైంది.
ఇంతకీ అదేమంటే.. టోక్యో ఒలింపిక్స్ లో తన జావెలిన్ త్రోతో దేశానికి స్వర్ణపతకాన్ని తీసుకొచ్చిన ఆగస్టు ఏడును ఇకపై జాతీయ జావెలిన్ డేగా గుర్తించనున్నట్లుగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 23 ఏళ్ల చిరు ప్రాయంలోనే నీరజ్ ఈ అపూర్వమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అథ్లెట్స్ లో భారత్ కు తొలి బంగారు పతకాన్ని సంపాదించి పెట్టిన నీరజ్ చోప్రా మీద అభినందనల వర్షం జోరుగా కురుస్తోంది.
దేశంలో జావెలిన్ త్రో కు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు.. ఈ క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఇకపై ప్రతి ఆగస్టు ఏడో తేదీని జావెలిన్ డేగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా జావెలిన్ త్రో పోటీలు నిర్వహించటం.. వేడుకగా బహుమతులు ప్రదానోత్సవం జరుపుతారు. తాజాగా తీసుకున్న నిర్ణయంపై నీరజ్ చోప్రా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన విజయం చిరస్మరణీయంగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.
అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకునే వారికి ఇదెంతో ప్రేరణను ఇస్తుందన్నారు. తాజా స్వర్ణంతో తన జర్నీ ఆగదని.. భవిష్యత్తులో అన్ని మెగా ఈవెంట్స్ లో పతకాల్ని సాధించటమే తన లక్ష్యమని చెప్పాడు. ఒలింపిక్ టైటిల్ తో మహిళా అభిమానులు కూడా జతయ్యారని.. తనకు ఇప్పటివరకు గర్ల్ ప్రెండ్ అయితే లేదన్నాడు. భవిష్యత్తులో తనను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూడాలన్న మాట.. ఎలాంటి పరిణామాలకు తెర తీస్తుందో చూడాలి.