Begin typing your search above and press return to search.
భార్యగా ఏటీఎం కార్డు ఇవ్వటం తప్పేనా?
By: Tupaki Desk | 7 May 2015 9:10 AM GMTసినిమాల్లో నటించేందుకు టాలీవుడ్ కి వచ్చేసి.. తాను నటించిన ప్రేమ ప్రయాణం సినిమా నిర్మాతను పెళ్లి చేసుకున్న సినీనటి నీతూ అగర్వాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా.. నిర్మాత భార్యగా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి ఎర్రచందనం కేసులో చిక్కుకొని.. రిమాండ్‌కు వెళ్లి.. తాజాగా బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను మీడియాతో పంచుకుంటున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన తనకు ఎర్ర చందనం గురించి అస్సలు తెలీదని..నటిగా ఉన్న తనకు మస్తాన్ వలీ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు..రాజకీయాల్లో ఉన్నానని చెబితే నమ్మానని.. పెళ్లి చేసుకున్నానని చెప్పుకున్నారు. భార్యగా ఎటీఎం కార్డు ఇచ్చినట్లు చెప్పిన ఆమె.. ఆ కారణంగా ఇన్ని సమస్యలువస్తాయని తాను భావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు మస్తాన్‌వలీ ఆస్తులేమీ ఇవ్వలేదని.. కానీ.. అతని వల్ల తనకు ఇలాంటి సమస్యలు వస్తాయని మాత్రం అస్సలు ఊహించలేదని వాపోయారు. తన అకౌంట్ ద్వారా రూ.2లక్షలు ఎవరికో వెళ్లాయని తనను అరెస్ట్ చేశారని.. తనకు ఆ విషయాలేమీ తెలీదని చెప్పుకొచ్చారు. ఒక భార్యగా.. భర్తకు ఎటీఎం కార్డు ఇవ్వటం.. బ్యాంకు ఖాతా నిర్వహణ లాంటివి మామూలే. తన విషయంలోనూ అలానే జరిగిందని ఆమె చెబుతోంది.
కానీ.. తనను మీడియా.. పోలీసులు మాత్రం అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకున్న ఆమె.. మస్తాన్ వలీతో తనకున్న సంబంధం తర్వాత నిర్ణయించుకుంటానని చెబుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కేసు నుంచి బయట పడటం అంత తేలికా? అమాయకురాలైన.. భర్త కారణంగా పడుతున్న ఇబ్బందులు చూస్తున్న వారు.. పాపం నీతూ అగర్వాల్ అని అంటున్నారు.