Begin typing your search above and press return to search.
రెండు సార్లు నెగటివ్ ..చివర్లో పాజిటివ్ ..కరోనాతో ఏఎస్సై మృతి !
By: Tupaki Desk | 18 July 2020 6:15 AM GMTకరోనావైరస్ తో చేస్తున్న యుద్ధంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు, వైద్యులు, సిబ్బంది కూడా కరోనా కాటుకి బలి అవుతున్నారు. కొందరిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ.. కరోనా టెస్టులు చేస్తే నెగటివ్ గా వస్తుంది. ఆ తరువాత అనుమానంతో సిటీ స్కాన్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలుతోంది. హైదరాబాద్ లో ఇటీవల ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తుండటంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే సిటీ స్కాన్ లో కరోనా పాజిటివ్ గా తేలిన ఓ ఏఎస్సై కరోనా తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. హైదరాబాద్ లో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ లో ప్రేమ్ కుమార మూడేళ్లుగా ఎఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఈ నెల 7న శ్వాస అమీర్ పేట్ లోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో కరోనా టెస్టు చేయించుకున్నాడు. ఆ టెస్టులో కరోనా నెగెటివ్ అని తేలింది. దీనితో కరోనా కాదనే భావనతో ఆయన ఎర్రగడ్డలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. అక్కడి డాక్టర్లు సిటీ స్కాన్ చేయగా.. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. దీనికి కరోనా కారణం కావొచ్చని అనుమానించిన డాక్టర్లు.. కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరాలని సూచించారు.
దీనితో అయనని కుటుంబ సభ్యులు కింగ్ కోఠి హాస్పిటల్ లో చేరారు. కానీ అక్కడి పరిస్థితులను చూసిన కుటుంబు సభ్యులు సికింద్రాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. భద్రతా కార్డు మీద వైద్యం చేయడం కుదదరని చెప్పారు. సోమవారం ఉన్నతాధికారుల చొరవతో ఆయన అపోలో హాస్పిటల్ లో చేరారు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. వైద్యులు ఏఎస్సైకి 3,4 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కరోనా తోడు కావడంతో శుక్రవారం ఆస్పత్రిలో మృతిచెందాడు. ఏఎస్సై మృతిపట్ల పోలీసు అధికారులు, సహచరులు విచారం వ్యక్తం చేశారు.