Begin typing your search above and press return to search.

వైద్యుల నిర్ల‌క్ష్యం: ఫ్లాస్మాకు బ‌దులు బ‌త్తాయి జ్యూస్ ఎక్కించారు!

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:14 PM GMT
వైద్యుల నిర్ల‌క్ష్యం:  ఫ్లాస్మాకు బ‌దులు బ‌త్తాయి జ్యూస్ ఎక్కించారు!
X
ఇటీవ‌ల కాలంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో వైద్యుల నిర్ల‌క్ష్యాల‌కు రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. కొన్ని సంద‌ర్భాల్లో రోగులు .. త‌మ అవ‌య‌వాల‌ను కూడా కోల్పోతున్నారు. ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఘ‌ట‌న‌లు చూస్తే.. ఒక కేసులో అప్పుడే పుట్టిన‌ చిన్నారి బొడ్డు క‌త్తిరంచ‌బోయి.. వేలు క‌త్తిరించేసిన ఘ‌ట‌న ఆ కుటుంబాన్ని ఆవేద‌న‌లోకి నెట్టేసింది.

ఇక‌, ఏపీలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో అప్పుడే పుట్టిన చిన్నారికి.. ఇంక్యుబేట‌ర్ అవ‌స‌రం అంటూ.. అందులో పెట్ట‌గా.. స‌రైన విధంగా.. ఇంక్యుబేట‌ర్‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డం.. కుడిచేయి.. చ‌చ్చుబ‌డిపోయింది. ఇలా.. వైద్యుల నిర్ల‌క్ష్యాలు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి.

ఇక‌, తెలంగాణ‌లో అయితే.. కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు విక‌టించి.. మ‌హిళ‌లు మృతి చెందిన ఘ‌ట‌న ప్ర‌భుత్వాన్ని కుదిపేసింది. ఇలా.. వైద్యుల నిర్ల‌క్ష్యాలు దేశంలో నిత్య‌కృత్యంగా మారాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో చోటు చేసుకున్న మ‌రింత దారుణంగా మారింది. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. డెంగ్యూ వ్యాధిగ్ర‌స్తుడు.. ప్రాణాలు కోల్పోయారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌యాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్య‌క్తి డెంగ్యూ వ్యాధి బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేరాడు.

డెంగ్యూ వైద్యంలో కీల‌క‌మైన ఫ్లాస్మాను రోగికి ఎక్కించాల‌ని నిర్ణ‌యించిన వైద్యులు అదే ప‌నిచేశారు. అయితే.. రోగికి ఫ్లాస్మాకు బ‌దులుగా.. బ‌త్తాయి జ్యూస్‌ను ఎక్కించేశారు. దీంతో .. వైద్యం విక‌టించి.. రోగి ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి బ్ల‌డ్ బ్యాంకు వారు ఇచ్చింది. ఏంటో ప‌రీక్షించాలి. ఆ త‌ర్వాతే.. రోగికి ఎక్కించాలి. ఇది క‌నీస జ్ఞానం. అయితే.. దీనినికూడా.. వైద్యులు ప‌క్క‌న పెట్టారు. క‌ళ్లు మూసుకుని.. వైద్యం అందించారు. దీంతో రోగి నిండు ప్రాణం బ‌లైపోయింది.

దీంతో ఆగ్ర‌హించిన కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ఇక‌, ఈ ఘ‌ట‌న తీవ్ర వివాదానికి దారితీయ‌డంతో డిప్యూటీ సీఎం.. బ్ర‌జేష్ పాఠ‌క్ స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. అస‌లు ఫ్లాస్మా న‌కిలీదా..? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఏదేమైనా.. దేశ‌వ్యాప్తంగా వైద్యుల నిర్ల‌క్ష్యంపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.