Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బద్దకం.. ప్రజలకు శాపం

By:  Tupaki Desk   |   30 Aug 2020 5:30 AM GMT
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బద్దకం.. ప్రజలకు శాపం
X
అరే డబ్బులిచ్చి ఖర్చు చేయమంటే ‘అరుణాచలం’ మూవీలో రజినీకాంత్ లా కోట్లకు ఖర్చు చేసేవారిని చూస్తుంటాం.. యువతకు, పిల్లలకు ఇలా డబ్బులిస్తే అలా ఖర్చు పెడుతారు. ఏదో ఒకటి తినేసి లావైపోతారు. కానీ ప్రజాప్రతినిధులకు వేల కోట్లు ఇచ్చి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయండయ్యా అంటే వారు వెలుగబెట్టిన వ్యవహారం చూసి ఇప్పుడు ప్రజలు చీతర్కిస్తున్నారు. మేము ఓట్లేసిన గెలిపించిన వారు మా కోసం నిధులు ఖర్చు చేయని వైనం చూసి నిలదీస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం 2014-19 కాలంలో ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను భారీగా కేటాయించింది. కానీ వాటిని ఖర్చు చేయడంలో వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలకు పనులు కాకుండా వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2014-19 మధ్య గత ఐదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏకంగా 1440 కోట్లు విడుదల చేసింది. వీటిని నాలాలు, బోర్లు, స్కూల్ బిల్డింగులు, స్ట్రీట్ లైట్లు ఇతర పనులకు తమ ఖర్చు చేయాలని సూచించింది. కానీ ప్రజాప్రతినిధులు కేవలం రూ.974 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

ఇక ఎమ్మెల్సీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.974 కోట్లు కేటాయించగా.. రూ.254 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తాజాగా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బయటపడింది.