Begin typing your search above and press return to search.
మోడీకి ట్వీట్ తో షాకివ్వబోయి.. షాక్ తిందే
By: Tupaki Desk | 22 July 2015 12:04 PM GMTసోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పుణ్యమా అని.. ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలు కాస్తంత ఓపెన్ గానే పంచుకుంటున్న పరిస్థితి. గతంలో ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే మీడియాలో మాట్లాడాల్సి ఉండటం.. లేనిపోని వివాదాలు ఎందుకంటూ ఎవరికి వారు దేనిపై మాట్లాడకుండా.. చాలా పరిమితంగా ఉండేవారు.
సాంకేతిక విప్లవం పుణ్యమా అని ఎవరు ఎవరి గురించైనా మాట్లాడే అవకాశం ఉండటం.. అదే సమయంలో తాము అనుకుంటున్న విషయాల్ని నలుగురితో చెప్పుకోవాలన్న భావన ఈ మధ్య పెరిగింది. సామాన్యుల్లో ఎలా ఉన్నా.. సెలబ్రిటీల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.గతంలో సినిమా తారాగణం.. రాజకీయాల గురించి చాలా.. చాలా పరిమితంగా మాట్లాడేవారు. రాజకీయాల గోల మనకెందుకంటూ.. ఎవరైనా ప్రశ్నలు వేసినా.. దాన్ని వదిలేయండంటూ సున్నితంగా తిరస్కరించే వారు.
కానీ.. ఇప్పుడు ఫేస్ బుక్.. ట్విట్టర్..లాంటి సామాజిక వెబ్ సైట్ల పుణ్యమా అని మార్పు వచ్చేసింది. తాజాగా బాలీవుడ్ అందాల భామ నేహాధూపియా ఇలానే స్వేచ్ఛగా తన మనసులోని మాట చెప్పే క్రమంలో అడ్డంగా బుక్ అయిపోయారు.
ముంబయి వరదల అంశాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ పాలనను ఏకేసింది. ఏకధాటిగా కురిసిన వానలతో ముంబయి తడిచి ముద్దయిందని.. గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు దిగటం.. యోగా చేయించటం కాదని.. భద్రతపై ప్రజలకు భరోసా ఇవ్వటం అంటూ ట్వీట్ చేసింది. దీనికి నెటిజన్ల స్పందన వేరుగా ఉంది. మోడీకి సమర్థిస్తూ.. నేహా ట్వీట్ ను విమర్శిస్తూ పెద్ద ఎత్తున కౌంటర్లు వేయటం గమనార్హం. పబ్లిసిటీ కోసమే నేహా ఇలా చేస్తుందని.. కెరీర్ ను గాట్లో పెట్టుకోవటానికే ఇలాంటి పాట్లు అంటూ మోడీకి అండగా నిలిచారు. ప్రధానమంత్రి స్థాయి నాయకుడి పాలనను ఒక సెలబ్రిటీ విమర్శిస్తే.. దానికి ఇలాంటి రియాక్షన్ రావటం చూసిన వారు.. ఇది నేహాకు కచ్ఛితంగా షాకే అని వ్యాఖ్యానిస్తున్నారు.