Begin typing your search above and press return to search.

పొరుగు సీఎంలు సూపరట...?

By:  Tupaki Desk   |   12 Feb 2022 11:30 PM GMT
పొరుగు సీఎంలు సూపరట...?
X
రాజకీయాల్లో ఇపుడు అంతా సీన్ మారింది. సమిష్టి బాధ్యతల నుంచి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే దాకా పరిస్థితి వస్తోంది. అదే విధంగా దేశ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రీ కృత విధానాలు బలంగా అమలవుతున్నాయి. ఈ నేపధ్యంలో వ్యక్తి పూజకు ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. అదే సమయంలో తమకు తప్ప వేరేవరినీ కీర్తించినా ప్రశంసించినా సహించలేని అసహన తత్వం కూడా మొదలైంది.

ఒక విధంగా వర్తమానంలో రాజకీయాలు చేయడం అన్నది చాలా క్లిష్టమైన వ్యవహారంగా మారుతోంది. ఇలా సీఎంలు ఎక్కడికక్కడ తమ అనుచరులతో ప్రశంసలు అందుకోవడం అంతా చూస్తున్నదే. వైసీపీలో జగన్ అన్నా అంటూ క్యాడర్ తో పాటు లీడర్లు అంతా బాగా అభిమానం చూపిస్తారు. అయిన దానికీ కాని దానికీ కూడా తమ నేతను పొగిడేస్తారు.

ఇదిలా ఉంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఎమ్మెల్యే ఆర్ కే రోజా జగనన్నా అని బాగానే కీర్తిస్తారు. అయితే ఆమె ఇపుడు పొరుగు రాష్ట్రాల సీఎం లను తెగ పొగుడుతున్నారు. ఈ మధ్యనే తన భర్త సెల్వమణితో కలసి తమిళనాడు సీఎం స్టాలిన్ ని ఆయన చాంబర్ లో కలసి వచ్చారు రోజా.

ఏపీలో తమిళున సమస్యల మీద ఆమె స్టాలిన్ కి వినతి చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ పాలన బాగుందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇపుడు ఆమె హైదరాబాద్ లో ని యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. అంతే ఆమె కేసీయార్ ని ఏకంగా ఆకాశానికెత్తేశారు. కేసీయార్ యాదాద్రిని అద్భుతంగా నిర్మించారని, ఆయన వల్లనే ఇది సాధ్యపడిందని కూడా రోజా అన్నారు.

కేసీయార్ చేత ఆ దేవుడే ఇలా చేయించారని కూడా రోజా ప్రశంసించారు. కేసీయార్ ఈజ్ గ్రేట్ అని ఆమె కితాబు ఇచ్చేశారు. నిజంగా యాదాద్రి ఆలయన్ని కేసీయార్ గొప్పగా మలచారు. అందులో రెండవ మాట లేదు. రోజా పొగడడంలో తప్పు కూడా లేదు, అలాగే స్టాలిన్ పాలన కూడా బాగుంది. ఇలా పొరుగు సీఎం లను పొగడడం వరకూ ఓకేగా ఉన్నా దేశంలో వారిలా ఎవరూ చేయలేరు అనడం అంటే కొంచెం ఎక్కువేనేమో అన్న మాట వినవస్తోంది.

ఇక ఈ మధ్యనే రోజా నగరిలో తనకు యాంటీగా సొంత పార్టీలోనే ఒక గ్రూప్ తయారవుతోందని మధన పడుతున్నారు. రాజీనామా కూడా చేయాలనుకున్నారని వార్తలు వచ్చాయి. దాన్ని ఆమె ఖండించినా కూడా నగరిలో వైరి వర్గం తలనొప్పులూ ఎటూ ఉన్నాయి. వీటితో పాటు వచ్చే విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న డౌట్ కూడా ఒకటి ఆమెకు ఉంది. ఒక వేళ అక్కడ ఏమైనా తేడా కొడితే ఈ ఫైర్ బ్రాండ్ సొంత స్టేట్ పాలన మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్న చర్చ కూడా వస్తోంది. చూడాలి మరి.