Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ తో సరసాలు.. బయటపడడంతో శాస్త్రవేత్త రాజీనామా

By:  Tupaki Desk   |   7 May 2020 10:00 PM IST
గర్ల్ ఫ్రెండ్ తో సరసాలు.. బయటపడడంతో శాస్త్రవేత్త రాజీనామా
X
బ్రిటన్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. ఎవరూ ఇల్లు దాటి బయట అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించారు.

ఈ క్రమంలోనే బ్రిటన్ అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ సూచనతోనే ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ దేశవ్యాప్త లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా లాక్ డౌన్ పెట్టాలి.. సహాయక చర్యలు, నివారణ చర్యలపై ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా నీల్ ఫెర్గ్యూసన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న ఆయనే స్వయంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. తన గర్ల్ ఫ్రెండ్ అంటోనియా స్టాట్స్ ను రెండు సార్లు తన ఇంటికి రప్పించుకున్నారు. ఈ ఘటన బ్రిటన్ లో పెను దుమారం రేపింది.

క్రమశిక్షణ, ఎంతో మేధావి అయిన నీల్ ఫెర్గ్యూసన్ ఇలా చేయడం నమ్మలేకపోతున్నామని బ్రిటన్ మాజీ మంత్రి , ఎంపీలు విస్మయం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో నీల్ ఫెర్గ్యూసన్ తాజాగా సైంటిఫిక్ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్ (సేజ్)కు రాజీనామా చేశారు.తాను తన గర్ల్ ఫ్రెండ్ ను ఇంటికి తెచ్చుకున్నానని అంగీకరించాడు.