Begin typing your search above and press return to search.
బాలకృష్ణ పై అనిల్ కుమార్ షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 11 Nov 2017 2:12 PM GMTప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వైసీపీని, జగన్ ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని ఢీకొట్టాలంటే కొండను ఢీకొట్టినట్లేనని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మరోసారి జగన్ పాదయాత్రపేరుతో జనంలోకి వెళ్తున్నారని ఘాటుగా విమర్శించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దెబ్బకు పది సంవత్సరాల పాటు టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ , పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొని, 600 దొంగ హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మరచిపోకూడదన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడిన సందర్భంగా అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రియతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర చేపడుతున్నారనగానే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. తన మానసిక స్థితి సరిగ్గా లేదని ముంబై ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ పొంది ఓ కేసు లోనుంచి బాలకృష్ణ తప్పించుకున్న మాట వాస్తవమో? కాదో ఆయన చెప్పాలని అనిల్ అన్నారు. కన్నతండ్రిని చెప్పులతో కొట్టి, ఆయనను వెన్నుపోటు పొడిచిన బావకు వత్తాసు పలికిన ఘనత బాలకృష్ణదని ఎద్దేవా చేశారు. తన తండ్రి వెనుక నిలబడలేక, ఆయన కాపాడలేక బావ వెంట పారిపోయిన బాలకృష్ణ.....జగన్ గారిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఒక మహనీయుడి కడుపున ఎటువంటి పిల్లలు పుట్టకూడదో చెప్పేందుకు బాలకృష్ణ ఉదాహరణ అని, పులి కడుపున పులే పుడుతుందనేందుకు డైనమిక్ లీడర్ వైఎస్ ఆర్ కడుపున పుట్టిన జగన్ మోహన్ రెడ్డిగారు ఉదాహరణ అని చెప్పారు.
వైఎస్ ఆర్ ఖ్యాతిని జగన్ దేశవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్నారని, అందుకు విరుద్ధంగా బాలకృష్ణ అభిమానులపై చెయ్యి చేసుకొని విమర్శలపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దేశంలోనే గజ మోసగాడని బిరుదు పొందారని అనిల్ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఢీకొంటే కొండైనా పిండి అయిపోతుందని హెచ్చరించారు. డైనమైట్ పెట్టి పేల్చినట్టు కొండ పేలిపోతుందని టీడీపీని ఉద్దేశించి అనిల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన జగన్ పై విమర్శలను మానుకోవాలని హితవు పలికారు. జగన్ గారికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు.