Begin typing your search above and press return to search.
డ్రైనేజీలో వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిరసన !
By: Tupaki Desk | 5 Dec 2018 11:03 AM GMTవైసీపీ ఎమ్మెల్యేల్లో మంచి వాదనా పటిమతో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ ఒక ఆడుకునే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్నితీవ్రంగా ఎండగట్టి బజారున నిలబెట్టారు ఈరోజు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం స్థానికులను అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన పాడుబడింది. కొత్తది నిర్మించాలని చాలారోజులుగా ఆయన అధికారులను కోరుతున్నారు. అయితే వారి నుంచి స్పందన లేదు. దీంతో ఇలా అయితే వారు మాట వినరని ఏకంగా మురుగులోకి దిగి నిరసన తెలియజేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నడుం లోతు కంటే ఎక్కువ ఆయన డ్రైనేజీలో నిలబడ్డారు. అధికారులు వచ్చినా కూడా డ్రైనేజీలోనే ఉండి మాట్లాడారు. మీరు పని ప్రారంభిస్తేనే నేను బయటకు వస్తాను. లేకపోతే రాను అని అధికారులకు ఖరాఖండిగా చెప్పడంతో అధికారులు చేసేదేం లేక పనులు మొదలుపెట్టారు. దీంతో ఆయన బయటకువచ్చారు. 45 రోజుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యేకు అధికారులు హామీ ఇచ్చారు. ఈ చర్యతోఎమ్మెల్యే ప్రజల మనసు దోచుకున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. వైరల్ అవుతోంది. శ్రీధర్ రెడ్డి స్పందన పట్ల అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.