Begin typing your search above and press return to search.
ఏపీలో ఇంకో సైట్ హ్యాక్ అయింది
By: Tupaki Desk | 1 Aug 2016 12:06 PM GMTఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీల వెబ్ సైట్ లపై ఉగ్రవాదుల కన్ను పడినట్లుంది. ఇప్పటికే ఆంధ్రా యూనివర్సిటీ వెబ్ సైట్ ను మూడు సార్లు హ్యాక్ చేసిన దుండగులు ఇపుడు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్శిటీపై పడ్డారు. వర్సిటీకి సంబంధించిన వెబ్ సైట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తమ వెబ్ సైట్ ను ఎవరో హ్యాక్ చేశారని గుర్తించిన అధికారులు వెబ్ సైట్ ను పూర్తిగా నిలిపివేశారు.
యూనివర్శిటీ వెబ్ సైట్ ను హ్యాకింగ్ చేసిన వ్యక్తులు ఇంగ్లీషు అక్షరాలతో రాసిన ఓ పేజీని ఉంచారు. ఆ పేజీతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫొటో - ముఖంపై గాయాలతో ఉన్న ఫొటో - మంచంపై పడుకుని ఉన్న ఓ యువతి ఫొటోలను ఉంచారు. ఇంగ్లీషులో రాసి ఉన్న పేజీలో గుర్తుతెలియని వ్యక్తులు పలు విషయాలను సూచించారు. ఇటీవల కాశ్మీర్ లో జరుగుతున్న దాడుల్లో కాశ్మీర్ వాసులపై అన్యాయంగా కాల్పులు జరుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాల్పుల వల్ల ఇప్పటికే 200 మంది చూపు కోల్పోయారని, లక్షలాది మంది కాశ్మీరీలు రెండు వారాలుగా నరకం అనుభవిస్తున్నారని రాసి ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మ పక్కనే మోదీ చర్యలను తాము చూస్తూ భరించలేమంటూ డాక్టర్ సయ్యద్ ఖాన్ పేరుమీద హెచ్చరికలు చేసి ఉన్నారు. ఇక హీరో షారూఖ్ ఖాన్ ముఖంపై గాయాలతో ఉన్న ఫొటో కింద జునైద్ నజీర్ పేరుతో హెచ్చరికలు ఉన్నాయి. కాశ్మీర్ కు సంబంధించిన హింషా అనే 14 ఏళ్ల యువతిపై పోలీసులు చేసిన దాడిలో ఆ పాప ఇలా గాయాలపాలై చూపు కోల్పోయిందని గాయాలతో ఉన్న యువతి ఫొటోను వారు ఆప్ లోడ్ చేసిన పేజీలో ఉంచారు. ఇంత జరిగినా విక్రమ సింహపురి యూనివర్శిటీ అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. తమ వెబ్ సైట్ ను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం 4 గంటలకు హ్యాకింగ్ చేస్తే కనీసం స్పందించినవారే లేరు. తాపీగా మరుసటి రోజు ఉదయం ఆఫీసు వేళల్లో తదుపరి చర్యలు చేపట్టారు.