Begin typing your search above and press return to search.

20-20లో మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ రికార్డు

By:  Tupaki Desk   |   29 Sep 2019 8:25 AM GMT
20-20లో మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ రికార్డు
X
అంతర్జాతీయ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డులు న‌మోదు అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే చిన్న చిన్న ప‌సికూన‌ల్లాంటి జ‌ట్లు కూడా ఈ టోర్న‌మెంటులో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. స్కాట్లాండ్‌ - నెద‌ర్లాండ్స్‌ - ఐర్లండ్ లాంటి జ‌ట్ల‌తో పాటు యూఏఈ - నేపాల్ లాంటి జ‌ట్ల‌తో పాటు ఇంకా చిన్న చిన్న జ‌ట్లు కూడా పెద్ద జ‌ట్ల‌కే కాని రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి. గ‌త యేడాది కాలంగా ప‌లు చిన్న దేశాల మ‌ధ్య 20-20 క్రికెట్ టోర్న‌మెంటులు విరివిగా జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే సింగ‌పూర్‌ లో జ‌రుగుతోన్న ముక్కోణపు సిరీస్‌ లో భాగంగా సింగపూర్‌ తో జరిగిన మ్యాచ్‌ లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగాడు. ఈ క్ర‌మంలోనే అంత‌ర్జాతీయ 20-20 క్రికెట్ టోర్న‌మెంటులో ఛేజింగ్ లో సెంచ‌రీ చేసిన తొలి కెప్టెన్‌ గా ఖ‌డ్కా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సింగ‌పూర్ 151 ప‌రుగులు చేసింది. అనంత‌రం 152 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేప‌ట్టిన నేపాల్ 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ ను ఛేదించింది. ఇక్కడ నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు - 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు.

ఇక సెంచ‌రీ చేసిన ప‌రాస్ అంత‌ర్జాతీయ 20-20 క్రికెట్ టోర్న‌మెంట్లో సెంచ‌రీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌ గా రికార్డుల‌కు ఎక్క‌డంతో పాటు టీ20 ఫార్మాట్‌ లో ఛేజింగ్‌ లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌ గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే మ‌రో అరుదైన రికార్డు కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతంగా ఈ ఫీట్‌ సాధించిన నాలుగో ఆసియా కెప్టెన్‌ గా నిలిచాడు. ఇక ముందుగా సింగ‌పూర్ 151 ప‌రుగులు చేయ‌గా ఆ జ‌ట్టు కెప్టెన్ టిమ్‌ డేవిడ్‌(64 నాటౌట్‌) రాణించగా - సురేంద్రన్‌ చంద్రమోహన్‌(35) ఫర్వాలేదనిపించాడు.