Begin typing your search above and press return to search.
కొత్త భయం; ఆ దేశంపై వరదలు విరుచుకుపడతాయా?
By: Tupaki Desk | 24 May 2015 10:43 AM GMTవరుస భూకంపాల తాకిడికి నేలమట్టమైన నేపాల్‌కు మరో కష్టం వచ్చి పడింది. ప్రకృతి పగబట్టినట్లుగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్న భూకంపాల తాకిడి నేటికి తగ్గలేదు. భయం గుప్పెట్లో బతుకుతున్న నేపాలీలకు ఇప్పుడు ప్రకృతి మరో సవాలు విసిరింది.
నేపాల్‌లోని మ్యాగ్దీ జిల్లాలోని కాళీ గండకీ నదిలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఆ నది నీటి మట్టం భారీగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. 150 మీటర్ల మేర అని చెబుతున్నారు. దీంతో.. నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలు వేలాదిగా సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.
ఏ క్షణంలో అయినా.. వరదలు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో వారు ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి పరుగులు పెడుతూ.. సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు. కొండ చరియలు భారీగా విరిగి పడటంతో..నీటిమట్టం పెరగటంపై అధికారుల వాదన మరోలా ఉంది. ప్రజలు ముందస్తు జాగ్రత్తగా వెళ్లిపోయారని.. సమీప గ్రామాలకు పెద్దగా ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. కానీ.. వారి మాటను ప్రజలు పట్టించుకోకుండా ఊళ్లను ఖాళీ చేసుకొని వెళ్లటం గమనార్హం.