Begin typing your search above and press return to search.

రాముడి వారసత్వంపై నేపాల్ కన్ను

By:  Tupaki Desk   |   13 July 2020 5:37 PM GMT
రాముడి వారసత్వంపై నేపాల్ కన్ను
X
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు భారతీయుడు కాదని, అతను నేపాలీ అని నేపాల్ ప్రధాని కేపీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా భారతదేశంతో కయ్యానికి కాలుదువ్వుతున్న నేపాల్ తాజా వ్యాఖ్యలు భారతీయుల ఆగ్రహానికి గురయ్యాయి. చైనా అండతో సరిహద్దుపై మంటలు రాజేసిన ప్రధాని తాజాగా చేసిన వ్యాఖ్యలతో భారత్ ను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది.

భారతదేశంలో ఉన్నది ఒరిజినల్ అయోధ్య కాదని, నిజమైన అయోధ్య నేపాల్లో ఉందని ప్రధాని కేపీ శర్మ కామెంట్లు చేశారు. రాముడు జన్మస్థానం విషయంలో భారత్ వాస్తవాలను వక్రీకరించిందని శర్మ ఆరోపించారు. నేపాల్ దేశంలోని పశ్చిమ బిర్గుంజ్ సమీంలోని థోరి గ్రామం నిజమైన అయోధ్య అని ఆయన పేర్కొన్నారు.

రాముడు దశరథుడి కుమారుడే గాని భారతీయుడు కాదట. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలకు ఇంకా ఆరెస్సెస్ నుంచి గానీ బీజేపీ నుంచి గాని స్పందన రాలేదు. ఏదేమైనా... చరిత్రలో అనేక సాక్ష్యాలున్న అయోధ్య గురించి చైనా చూపిన కుట్రదారిలో నడుస్తు కొత్త వివాదాన్ని రగల్చడానికి నేపాల్ ప్రధాని చేసిన ప్రయత్నాలు ఆయనకు బూమ్ రాంగ్ అవుతాయి. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందన ఎలా ఉండనుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.