Begin typing your search above and press return to search.
కేసీఆర్ మీద కొత్త విమర్శ చేసిన మహిళా కాంగ్రెస్
By: Tupaki Desk | 24 July 2015 9:25 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సరికొత్త ఆరోపణ చేశారు. ఇప్పటివరకూ ఆయనకున్న ఆరోపణలతో పాటు.. తాజా విమర్శ ఆయన్ను మరింత ఇరుకున పెట్టేది కావటం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదన్న విమర్శ పాతదే అయినా.. తెలంగాణ మహిళా కాంగ్రెస్ చీఫ్ నేరేళ్ల శారద చేసిన ఆరోపణల్లో ఒకటి కొత్తగా ఉంది.
తెలంగాణ క్యాబినెట్ లో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదన్న మాట పాతదే. అయితే.. తెలంగాణలో అన్నీ ఏర్పాటు చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ మహిళా కమిషన్ ను ఇప్పటివరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. లేని వ్యవస్థల్ని సైతం సృష్టించేందుకు ఉత్సాహం ప్రదర్శించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. తాజాగా శారద విసిరిన ప్రశ్న కాస్త ఇబ్బంది పెట్టేదే.
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడి దాదాపు 14 నెలలు దగ్గరకు కావొస్తున్నా.. ఇప్పటి్కి తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవటం రాజకీయ విమర్శగా మారటమే కాదు.. మహిళలకు పదవులు ఇచ్చే విషయంలో ఆయన పట్టనట్లు ఉంటున్నారన్న విమర్శ చెలరేగే అవకాశం ఉందని చెప్పొచ్చు.
తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని తెర మీదకు తీసుకురావటంతోపాటు.. పుష్కరాల్లో మహిళలకు కనీస వసతులు కల్పించలేదని వ్యాఖ్యానించారు. తన కుమార్తె ఒక్కరు బాగుంటే సరిపోతుందా? అని కేసీఆర్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. మొత్తమ్మీదా శారద తెరపైకి తీసుకొచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ డిమాండ్ రానున్న రోజుల్లో రాజకీయ డిమాండ్‌గా మారే వీలుందని చెబుతున్నారు.