Begin typing your search above and press return to search.
బోస్ హీరో.. గాంధీ జీరో అనే పుస్తకం?
By: Tupaki Desk | 27 Jan 2016 6:54 AM GMTవందల ఏళ్లు దేశంలో తిష్ట వేసిన బ్రిటీషోళ్లు.. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటానికి కారణం ఎవరు? అన్న ప్రశ్న వేసిన వెంటనే జాతిపిత మహాత్మ గాంధీజీ అని టక్కున చెబుతారు. అయితే.. ఈ సమాధానం తప్పు అంటూ ఒక పుస్తకం రానుంది. విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న సదరు పుస్తకంలో సంచలన విషయాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు.
బ్రిటీషోళ్లు భారత్ ను విడిచి పెట్టి వెళ్లటానికి కారణం.. గాంధీ ఎంతమాత్రం కాదని.. ఆయన అహింసతో చేపట్టిన ఉద్యమం బ్రిటీషోళ్లను ఏ మాత్రం కదిలించలేదని.. బోస్ చేపట్టిన చర్యలే వారు భారతదేశానికి స్వాతంత్ర్యం లభించేలా చేశాయన్న వాదనను వినిపిస్తూ తాజా పుస్తకం రానుంది. ప్రముఖ మిలటరీ చరిత్రకారుడు జనరల్ జీడీ బక్షీ రాసిన ఈ పుస్తకంలో చాలా వాస్తవాలు బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం ఎందుకు ఇచ్చారు? ఎవరి కారణంగా ఇచ్చారన్న విషయంపై నాటి బ్రిటన్ ప్రధాని అట్లీ చేసిన వ్యాఖ్యల్నిఈ పుస్తకంలో ఉటంకిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. భారత్ కు స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయంపై సంతకం చేసిన నాటి బ్రిటన్ ప్రధాని అట్లీ భారత్ లోని కోల్ కతాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పశ్చిమబెంగాల్ తాత్కలిక గవర్నర్ జస్టిస్ పీబీ చక్రవర్తి అతిధిగా ఆయన ప్యాలెస్ లో అట్లీ బస చేశారు. ఈ సందర్భంగా భారత్ కు స్వాతంత్ర్యం ఇవ్వటానికి కారణం ఏమిటని అట్లీని చక్రవర్తి ప్రశ్నించగా.. నేతాజీ మిలటరీ కార్యకలాపాలేనని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి విశేషాలున్న పుస్తకం త్వరలో బయటకు రానుంది. విడుదలకు ముందే సంచలనం రేపే అంశాలతో ఉన్న ఈ పుస్తకం.. విడుదలైతే మరెంత సంచలనంగా మారుతుందో?