Begin typing your search above and press return to search.

నేతాజీ మ‌ర‌ణంపై బ‌య‌ట‌ప‌డ్డ ర‌హ‌స్య నివేదిక‌

By:  Tupaki Desk   |   2 Sep 2016 4:58 AM GMT
నేతాజీ మ‌ర‌ణంపై బ‌య‌ట‌ప‌డ్డ ర‌హ‌స్య నివేదిక‌
X
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణంపై ఎప్ప‌టిక‌ప్పుడు ఏవో వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. ఆయ‌న మ‌ర‌ణం మిస్ట‌రీ అని కొంద‌రు చెబుతూ ఉంటారు. అయితే నేతాజీ మ‌ర‌ణాన్ని ధ్రువీక‌రిస్తూ 60 ఏళ్ల కింద‌టి వెలువ‌డిన జ‌పాన్ ప్ర‌భుత్వ నివేదిక తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. నేతాజీ ఎలా చ‌నిపోయార‌నేది స్ప‌ష్టంగా ఉన్న ఆ నివేదిక‌లో ఉంది. దీనికి సంబంధించిన ర‌హ‌స్య ప‌త్రాలు ఇప్పుడు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఈ నివేదిక ప‌త్రాల్లో ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. 1945, ఆగ‌స్టు 18న తైవాన్ విమాన ప్ర‌మాదంలో నేతాజీ ప్రాణాలు కోల్పోయార‌ని స్ప‌ష్టంగా ఉంది. దీనికి సంబంధించిన ఆధారాల‌తో మొత్తం స‌మాచారాన్ని
bosefiles.info
బ‌య‌ట‌పెట్టింది. టోక్యోలోని భార‌త రాయ‌బార కార్యాల‌యానికి 1956లోనే ఈ రిపోర్టును పంపించిన‌ట్టు పేర్కొంది. విమాన ప్ర‌మాదానికి గురైన రోజునే నేతాజీని ఆసుప‌త్రిలో చేర్చార‌నీ, అదే రోజు సాయంత్రం తుది శ్వాస విడిచార‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ నివేదిక‌లో తైవాన్ విమానం ఏ విధంగా ప్ర‌మాదానికి గురైంద‌నే విష‌యాన్ని కూడా స్ప‌ష్టంగా వివ‌రించారు. భూమి నుంచి 20 మీట‌ర్లు ఎత్తుకు ఎగిరిన కాసేప‌టికే విమానంలో సాంకేతిక స‌మ‌స్య మొద‌లైంది. ఎడ‌మ‌వైపు ఉన్న రెక్క‌లోని పెట‌ల్ విరిగిపోయింది. ఫ‌లితంగా ఇంజ‌న్ వెంట‌నే ఆగిపోయింది. ఆ ఎత్తు నుంచి వెళ్తున్న విమానం ఒక్క‌సారిగా ఎదురుగా ఉన్న కంక‌గుట్ట‌ను ఢీ కొట్టి, కూలిపోయింది. వెంట‌నే మంట‌లు చెల‌రేగాయి. ఆ మంట‌ల్లో బోస్ చిక్కుకున్నారు. ఆయన దుస్తులు కాలిపోతూ ఉండ‌టంతో వెంట‌నే విమానం నుంచి ఆయ‌న బ‌య‌ట‌కి దూకేశారు. ఆయ‌న దుస్తుల‌కు ఉన్న మంట‌ని ఆర్పేందుకు క‌ల్న‌ల్ రెహ్మామాన్ తోపాటు ఇత‌ర ప్ర‌యాణికులు ప్ర‌య‌త్నించారు. కానీ, అప్ప‌టికే నేతాజీ శ‌రీరం చాలా భాగం కాలిపోయింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో నేతాజీని నాన్మ‌న్ బ్రాంచ్ ఆఫ్ తైపీ ఆర్మీ ఆసుప‌త్రికి హుటాహుటిన త‌ర‌లించారు. వెంట‌నే చికిత్స ప్రారంభించారు. అదే రోజు రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో నేతాజీ తుదిశ్వాస విడిచారు. ఆగ‌స్టు 22వ తేదీన తైపీ మున్సిప‌ల్ శ్వ‌శానంలో నేతాజీకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. తాజాగా బ‌య‌ట‌ప‌డ్డ జ‌పాన్ నివేదిక‌లో నేతాజీ మ‌ర‌ణానికి సంబంధించిన వివ‌రాలు ఇవే.