Begin typing your search above and press return to search.

బ్రెగ్జిట్ తో అయిపోలేదు..డ్రెగ్జిట్..ఇగ్జిట్ మొదలయ్యాయి

By:  Tupaki Desk   |   24 Jun 2016 9:40 AM GMT
బ్రెగ్జిట్ తో అయిపోలేదు..డ్రెగ్జిట్..ఇగ్జిట్ మొదలయ్యాయి
X
విడిపోవటం అన్నది ఒక వ్యాధి. అది అస్సలు మొదలే కాకూడదు. ఒకసారి మొదలైతే.. అదిక ఆగదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కలిసి మెలిసి ఉంటూ.. నలుగురికి సాయంగా నిలవాలన్న భావన కంటే అందరి కంటే తానే బలంగా ఉండాలన్న అత్యాశకు చిహ్నమే బ్రెగ్జిట్ గా చెప్పొచ్చు. తాజాగా బ్రిటీషర్లు తమ బుద్ధిని పోగొట్టుకోకుండా ఈయూ కూటమిని నుంచి బయటకు రావాలన్న ప్రజాభిప్రాయ సేకరణకు ఓకే చెప్పేయటం తెలిసిందే. దీంతో 27 దేశాల యూరోపియన్ కూటమి నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయనుంది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు.

తాజాగా వచ్చిన ఫలితంతో డెన్మార్క్.. ఆ వెంటనే ఇటలీ కూడా యూరోపియన్ దేశాల నుంచి బయటకు రావాలన్న ఆలోచనకు బలం పెరిగినట్లైంది. బ్రెగ్జిట్ తో మొదలైన వేర్పాటులు.. ఇక రోజురోజుకి పెరగటం ఖాయంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. డెన్మార్క్.. ఇటలీతో పాటు.. స్వీడన్.. ఆస్ట్రియాలు కూడా కూటమి నుంచి వైదొలగనున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. అదో సంచలనంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ కలిసి ఉండి వ్యాపారం చేసుకున్నామని.. ఇకపై ఎవరికి వారు విడిపోయి వ్యాపారం చేసుకోవచ్చని.. అభివృద్ధి విషయంలో ఒకరికొకరు సాయం చేసుకోవచ్చని వారు అంటున్నారు. కలిసి ఉండి చేయలేని పనిని.. విడిపోయిన తర్వాత చేస్తామంటున్న ఈ దేశాల మాటలు కామెడీగా లేవు..?