Begin typing your search above and press return to search.

స్కూళ్ల‌లో గీత అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి!

By:  Tupaki Desk   |   26 Dec 2016 10:30 PM GMT
స్కూళ్ల‌లో గీత అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి!
X
హిందూమ‌తంపై భార‌త‌దేశంలో వివిధ వ‌ర్గాలు - లౌకిక వాదుల పేరుతో కొంద‌రు తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నప్ప‌టికీ...హిందూమతానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గౌర‌వం పెరుగుతోంది. హిందూమ‌తం అందించిన గొప్ప గ్రంథ‌మైన భ‌గ‌వ‌ద్గీత‌ను విద్యాభ్యాసంలో భాగంగా త‌ప్ప‌నిస‌రిగా ప‌ఠించాల‌ని నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వం ఆదేశించింది. గ్రేడ్ 5 నుంచి గీత అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి అని ఆ దేశ వ‌ర్గాలు ఆదేశాలు జారీచేశాయి. ఈ నిర్ణ‌యం వెనుక రెండు కార‌ణాలు ఉన్న‌ట్లు ఆ దేశ అధికారులు వివ‌రిస్తున్నారు.

నెద‌ర్లాండ్స్‌లోని హిందువుల్లో మెజార్టీ సురీనామ్ కేంద్రంగా ఉన్న‌వారంట‌. వారు విద్య అభ్య‌సించ‌డంలో, త‌ర్వాత ఉద్యోగ విధుల‌ నిర్వ‌హ‌ణ‌లో మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తున్నార‌ని ఆ దేశ అధికారుల అధ్య‌య‌నంలో తేలింది. ముస్లిం పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ట‌ర్కీ లేదా మొరాకోకు చెందిన వారు ఉన్నార‌ట‌. వీరిలో నేర్చుకునే త‌త్వం, ప‌నిలోనూ మెరుగైన విధానం క‌లిగిలేక‌పోవ‌డాన్ని నెద‌ర్లాండ్స్ అధికారులు గ‌మ‌నించారు. ఈ నేప‌థ్యంలో మెరుగైన విద్యాభ్యాసానికి కార‌ణాలు అన్వేషించ‌గా హిందూయిజంలోని విశిష్ట విధానాలు, గీతా సారాంశం వంటివి కార‌ణాల‌ని తేలింది. దీంతో త‌మ విద్యార్థుల్లోనూ ఆ సుగుణాల‌ను పెంపొందిచే దిశ‌గా గీత ప‌ఠ‌నం త‌ప్ప‌నిస‌రి చేస్తూ నెద‌ర్లాండ్స్ స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

కాగా ఇందుకు మ‌రోకారణం కూడా ఉంద‌ని ఆ దేశ అధికారులు చెప్తున్నారు. త‌మ విద్యార్థుల్లో భిన్న‌త్వంలో ఏక‌త్వం అనే భావ‌న‌ను పెంపొందించ‌డంలో భాగంగా గీత ప‌ఠ‌నాన్ని త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు వారు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు గీత‌లోని విభిన్న భావ‌న‌ల‌ను గ్రహించి స‌త్ప్ర‌వ‌ర్త‌న గ‌ల పౌరులుగా మ‌సులుకోగ‌లుగుతార‌ని భావించ‌డం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నెద‌ర్లాండ్స్ అధికారులు వివ‌రిస్తున్నారు. హిందువులు అంతా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే క‌దా ఇది.ఏమంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/