Begin typing your search above and press return to search.

ఆ సీఎం చాలా ఆనందంగా ఉన్నారట .. నడిరోడ్డు పై మహిళ పొగడ్తలు !

By:  Tupaki Desk   |   9 Aug 2021 5:30 AM GMT
ఆ సీఎం చాలా ఆనందంగా ఉన్నారట .. నడిరోడ్డు పై మహిళ పొగడ్తలు !
X
సాధారణంగా సీఎం కనిపిస్తే మాకు అది కావాలి , మాకు ఇది కావాలి అని అడుగుతారు. అలాగే, తర్వాత సీఎం కూడా మీరే అంటూ పొగడ్తలు కురిపించే అభిమానులు కూడా ఉంటారు. కానీ , సీఎం ఎదురుగా వచ్చి నిలబడితే , ఓ మహిళ మాత్రం సార్ మీరు చాలా హ్యాండ్సమ్ గా, స్మార్ట్ గా ఉన్నారు, ఈ వయసులో కూడా మీరు చాలా అందంగా కనపడుతున్నారు అని చెప్పి అక్కడున్న సమాన్య ప్రజలు, సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, మంత్రులు షాక్ అయ్యేలా చేసింది. అయితే ఆమె చెప్పిన మాటకు నవ్వుకున్న సీఎం ఆమె చేతిలో ఉన్న వినతి పత్రం తీసుని మీకు తరువాత ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం స్మార్ట్ గా ఉన్నావని ఆయనకే డైరెక్టు చెప్పిన రమ్యా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అంతే కాదు తరువాత సీఎం రమ్యాకు ఫోన్ చెయ్యడం, ఆమె సీఎంతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కు అభిమానుల్లో, డీఎంకే పార్టీ కార్యకర్తల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంకే. స్టాలిన్ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించారు. తండ్రి ఎం. కరుణానిధి రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న ఎంకే. స్టాలిన్ ఇటివల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నారు. భారీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో స్టాలిన్ కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం అయ్యారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సీఎం ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి, వివిధ కార్యక్రమాల్లో పాల్టొనగానికి ఓ జిల్లాకు వెళ్లారు. కర్ణాటక సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లాలో ఈనెల 5వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ పర్యటించారు.

సీఎం స్టాలిన్ పర్యటన సందర్బంగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం స్టాలిన్ కు వినతి పత్రాలు సమర్పించారు. అందరు ప్రజలు లాగే రమ్యా అనే ఓ సామాన్య మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సమస్యల గురించి సీఎంకు వివరించడానికి రోడ్డు పక్కన నిలబడి ఉంది. రమ్యాకు 42 సంవత్సరాలు. అందరితో పాటు గుంపులో గోవిందా అంటూ రమ్యూ కూడా నిలబడింది. సీఎం స్టాలిన్ కారు నిలుతారని, తాను మాట్లాడాతాను అని రమ్యా అస్సలు ఊహించలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో వెలుతున్న సీఎం ఎంకే. స్టాలిన్ కాన్వాయ్ రమ్యా నిలబడి ఉన్న చోట ఒక్కసారిగా ఆగింది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో వెలుతున్న సీఎం స్టాలిన్ కాన్వాయ్ రమ్యా నిలబడి ఉన్న చోట ఆగడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కారు డోడ్ తియ్యడంతో సీఎం స్టాలిన్ కారు దిగారు. ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్న రమ్యా సార్ మీ ముఖానికి వేసుకున్న మాస్క్ ఒక్కసారి తీస్తారా, ఒక్కసారి నేరుగా మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పింది. వెంటనే చిరునవ్వుతో సీఎం స్టాలిన్ ఆయన ముఖానికి ఉన్న మాస్క్ పక్కకు తీశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను నేరుగా అతి దగ్గర నుంచి చూసిన రమ్యా వచ్చిన పని మరిచిపోయి సార్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఈ వయసులో కూడా మీరు చాలా అందంగా కనపడుతున్నారు అని చెప్పడంతో అక్కడ ఉన్న సమాన్య ప్రజలు, సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, అధికారులు, సామాన్య ప్రజలు, మీడియా మిత్రులు షాక్ అయ్యారు. ఏదో సమస్య పరిష్కరించాలని సీఎం స్టాలిన్ కు రమ్యా మనవి చేస్తుందని అనుకుంటే ఈమె ఏమిటి ఈమె సీఎం పై ఈ విధమైన కామెంట్స్ చేసింది అంటూ షాక్ అయ్యారు.

సామాన్య మహిళ రమ్యా వేసిన డైలాగ్ తో నవ్వుకున్న సీఎం స్టాలిన్ ఆమెకు థ్యాక్స్ అమ్మా అని చెప్పి ఆమె చేతిలో ఉన్న వినతి పత్రం తీసుకుని మీకు తరువాత ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం స్టాలిన్ స్మార్ట్ గా ఉన్నారని ఆయనకే డైరెక్టు చెప్పిన రమ్యా హాట్ టాపిక్ అయ్యారు. అక్కడున్న మీడియా సిబ్బంది రమ్యాను ఇంటర్వూ తీసుకుని టీవీలల్లో వైరల్ చేశారు. నా సమస్య గురించి వినతి పత్రంలో పూర్తిగా వివరించి నా పేరు, ఫోన్ నెంబర్ రాసి ఆ వినతి పత్రం సీఎం స్టాలిన్ కు ఇచ్చానని, సార్ నాకు కచ్చితంగా ఫోన్ చేస్తారనే నమ్మకం ఉందని రమ్యా ఆ రోజు మీడియాకు చెప్పింది. అనుకున్నట్లే రమ్యాకు సీఎం స్టాలిన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

సీఎం స్టాలిన్ ఫోన్ చెయ్యడంతో రమ్యా కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. సార్ మా సమస్య గురించి మీకు వివరించాను. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా బాగా పని చేశారు. మీరు కూడా తమిళనాడులో రోడ్లు బాగా వేయించి, ప్రజలకు నీటి సమస్య లేకుండా ప్రజలను బాగా చూసుకుంటారని అనుకుంటున్నామని, మీ నాన్నగారి లాగా మీరు చాలా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నామని రమ్యా సీఎం స్టాలిన్ కు ఫోన్ లో చెప్పింది. తప్పకుండా మీ కోరికలు అన్నీ నేరవేరుస్తామని, ప్రజలకు మంచి చెయ్యడానికి తనకు ఈ అవకాశం వచ్చిందని సీఎం స్టాలిన్ రమ్యాకు ఫోన్ లో చెప్పారు.

సీఎం స్టాలిన్ తో రమ్యాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా మాట్లాడారు. రమ్యా కూతురు దివ్యా సీఎం స్టాలిన్ తో మాట్లాడుతూ సార్ నేను ఇంటర్ చదువుతున్నానని, ఆన్ లైన్ క్లాసుల్లో చదువుతూ చాలా బోరు కొడుతోందని, కాలేజ్ లు తెరిపించాలని సీఎం స్టాలిన్ కు మనవి చేసింది. కరోనా వైరస్ పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే అన్ని విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని, అంత వరకు ఓపిక పట్టాలని సీఎం స్టాలిన్ అన్నారు. మరోసారి తల్లి రమ్యా, ఆమె కూతురు దివ్యా మీరు చాలా అందంగా, హ్యాండ్సమ్ గా ఉన్నారని, ఈ వయసులో కూడా మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారని సీఎం స్టాలిన్ కు చెప్పారు. సీఎం స్టాలిన్ తో రమ్యా ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు వీడియో తీశారు. సీఎం స్టాలిన్, రమ్యా మాట్లాడినంత సేపు వీడియో తీసిన కుటుంబ సభ్యులు ఆనందంతో తట్టుకోలేక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.