Begin typing your search above and press return to search.

బైరెడ్డి సిద్ధార్థ‌కు అంత సీన్ లేదా?

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:32 PM GMT
బైరెడ్డి సిద్ధార్థ‌కు అంత సీన్ లేదా?
X
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వైసీపీ యువ నాయ‌కుడు. యువ‌జ‌న‌, క్రీడ‌ల కార్పొరేష‌న్‌కు ప్ర‌స్తుతం ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన ఈయ‌న.. విష‌యం ఏదైనా.. నిత్యం ఆయ‌న మీడియాలో ఉండేందు కు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అదేస‌మ‌యంలో క‌ర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన నందికొట్కూరుకు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బైరెడ్డికి, ఇక్క‌డ నుంచి గెలిచిన ఆర్థ‌ర్‌కు మ‌ధ్య వివాదాలు తారస్తాయిలో జ‌రుగు తున్నాయి. ఎమ్మెల్యేకు క‌నీసం విలువ ఇవ్వ‌కుండా.. అంతా త‌నే అయి.. ఇక్క‌డ రాజ‌కీయాలు న‌డిపిస్తు న్నాడు బైరెడ్డి.

అయితే.. వాస్త‌వానికి సిద్ధార్థ రెడ్డి ఎవ‌రు? అంటే.. సీమ హ‌క్కులకోసం.. పోరాడి.. ప్ర‌స్తుతం ఒక కీలక పార్టీలో ఉన్న‌.. బైరెడ్డి రాజ‌శేఖ‌రెడ్డికి బంధువే. వ‌రుస‌కు కొడుకు వ‌రుస‌.. అయితే.. రాజకీయంగా బైరెడ్డి వైసీపీలోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. నందికొట్కూరు ఇంచార్జ్‌గా ప‌నిచేస్తున్నారు. అయితే.. త‌న‌కు అధిష్టానం వ‌ద్ద‌.. ప‌లుకుబ‌డి ఉంద‌ని.. త‌న‌ను ఎదిరించే నాయ‌కుడు ఎవ‌రూ లేర‌ని.. సిద్ధార్థం ప‌దే ప‌దే చెప్పుకొంటారు. అంతేకాదు.. యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా.. ప్ర‌చారం చేయించుకుంటాడ‌నే చ‌ర్చ కూడా ఉంది.

అయితే.. సిద్ధార్థ పిల్ల నాయకుడ‌ని.. ఆయ‌న వ‌ల్ల ఏమీకాద‌ని.. ఆయ‌న సీనియార్టీ.. ఎంత‌ని ? అనేవారు కూడా ఉన్నారు. కేవ‌లం సోష‌ల్ మీడియాలోను.. యూట్యూబ్ ఛానెల్‌లోనూ.. డ‌బ్బా కొట్టుకున్నంత మాత్రాన ఒరిగేది ఏంట‌ని ఫప్ర‌శ్నిస్తున్నారు. సొంత మండ‌లం కానీ.. జక‌ర్నూలు జిల్లాలో కానీ.. ఒక్క ఎమ్మ‌ల్యే అయినా.. సిద్ధార్థ‌ను ప‌ట్టించుకోరంట‌. అంతేకాదు.. ఎవ‌రూ ఆయ‌న‌ను ఏ కార్య‌క్ర‌మానికీ పిల‌వ‌రంట‌. ఒక ఎమ్మెల్యే యూట్యూబ్ చాన‌ల్‌లో అత‌నికి అంత సీన్‌లేదు. కేవ‌లం కావాల‌నే అత‌న్ని లేపుతున్నారు.. అని చెప్పాడు.

అందుకే.. ఇటీవ‌ల క‌కాలంలో కొస్తా ప్రాంతానికి వెళ్లిన సిద్ధార్థ రెడ్డి.. హడావుడి చేస్తున్నాడ‌ని చెబుతున్నారు. యూట్యూబ్‌లో చ‌లాకీగా ఉండే ఎమ్మెల్యేలు మాత్ర‌మే.. బైరెడ్డిని పిలుస్తున్నార‌ని.. మిగిలిన వారు ఎవ‌రూ కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ విష‌యాల‌ను అన్నింటినీ.. పార్టీ అధిష్టానం ప‌రిశీలిస్తోంద‌ని.. గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.