Begin typing your search above and press return to search.
చెడిపోయినప్పుడు బాగు చేయాలి కదా? మూడేళ్లలో అలాంటిదేమైనా చేశారా?
By: Tupaki Desk | 2 Jan 2022 4:30 PM GMTతెలుగువాడికి తిండి లేకున్నా ఫర్లేదు.. రాజకీయం ఉంటే చాలు.. బతికేస్తాడన్న నానుడి అప్పుడప్పుడు కొందరి నోటి నుంచి వింటుంటాం. నిజమే.. తెలుగు వారు మిగిలిన విషయాల కంటే ఎక్కువగా రాజకీయాలకు అమితమైన ప్రాధాన్యతను ఇస్తుంటారు. దాన్నో పవర్ గేమ్ కంటే కూడా.. దాన్ని మరింత వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఎవరిక ఇష్టాలకు అనుగుణంగా.. రాజకీయంగా ఒక లైన్ తీసుకోవటం మామూలే అయినా.. దాన్ని నరనరాల్లోని నింపుకొని.. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లుగా వ్యవహరించటం.. రాజకీయ వైరుధ్యాల్ని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకోవటంలో తెలుగోళ్లకు మించినోళ్లు మరొకరు ఉండరు.
అముదాలవలసతో అయినా.. అమెరికాలో అయినా సైద్ధాంతిక విభేధాలు మామూలే. కానీ.. వాటిని ఒక స్థాయి వరకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే తెలుగు వారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ అధినేతలు.. నేతలు కనిపిస్తారు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయన్న ఆవేదనను అందరూ వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా అదే మాట వచ్చేసింది. మంచి చేస్తుంటే విమర్శించే వారు కూడా ఉంటారని.. అలాంటి విమర్శలకు ప్రజలే సమాధానం చెప్పాలన్న ఆయన.. ‘‘చెడిపోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నాం.
రాజకీయ స్వార్థంతో ప్రతి విషయంలో అడ్డు తగులుతున్నారు. ఈ ఏడాదిలో అయినా పేదలకు చేస్తున్న మంచికి అడ్డుతగలవద్దన్న జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నా. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మంచి చేయలేని పార్టీలు.. నాయకులు విమర్శిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం వద్దని అడ్డుకున్నారు. పేదలకు ఆస్తిని పంచి పెడుతుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారు. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంటే కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఓటీఎస్ ఇస్తామంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అందుబాటు రేటుకు వినోదం అందివ్వాలని నిర్ణయం చేస్తే వ్యతిరేకిస్తున్నారు’ అంటూ తనకు ఎదురవుతున్న సవాళ్లను ఏకరువు పెట్టారు.
ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానాల్ని రాజకీయాల మీద చిన్నపాటి అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇచ్చేస్తారు. ఒకవేళ అదే చేస్తే.. రాజకీయ కౌంటర్.. మనసులో ఏదో పెట్టుకొని చెబుతున్నాడని అనేస్తారు. అందుకే.. అన్ని కాకున్నా.. హైలెట్ లాంటి అంశాల గురించి మాట్లాడుకోవటం సబబుగా ఉంటుంది.
అందులో భాగంగా.. ముందుగా జగన్ చెప్పిన మాటల్లో చెడిపోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నామన్న ఆయన మాటల్నే తీసుకుంటే.. చెడిపోయినప్పుడు బాగు చేయొచ్చు కదా? నలుగురికి ఆదర్శంగా ఉండొచ్చు కదా? రాజకీయాల్లో ఎవరి దాకానో ఎందుకు? జగన్ తండ్రి దివంగత మహానేత వైఎస్ ను చూస్తే.. రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం వ్యక్తిగతంగా ఆయన్ను అమితంగా ఇష్టపడేవారు. వైఎస్ వారసత్వంగా అధికార పగ్గాల్ని అందుకున్న జగన్.. ఆయన మాదిరి మనసుల్ని ఎందుకు దోచుకోలేకపోతున్నారు?
అందుబాటు ధరల్లో వినోదాన్ని ఇద్దామనుకుంటే అడ్డు తగులుతున్నారన్న జగన్ మాటల్ని తీసుకుంటే.. అందుబాటు ధరల్లోకి వినోదం సరే.. రోజువారీ బతుకు బండి మరింత మెరుగ్గా లాగేందుకు పెట్రోల్.. డీజిల్ మీద ధరల్ని ఎందుకు తగ్గించరు? రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గించుకుంటే ప్రజల మీద భారం తగ్గిపోతుంది కదా? జార్ఖండ్ ముఖ్యమంత్రి మాదిరి.. అన్ని వాహనాలకు కాకున్నా.. టూవీలర్ కు లీటరు పెట్రోల్ మీద రూ.25 తగ్గించారు. అలా అయినా జగన్ చేస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉండే ద్విచక్ర వాహనదారులకు ఊరట కల్పించినట్లు అవుతుంది కదా? అలాంటివి ఎందుకు తీసుకోరు?
చౌకధరకు వినోదాన్నిఅందివ్వాలన్న ఆలోచన మంచిదే. అలా అని కప్పు టీ సైతం రూ.10 ధర పలుకుతున్న వేళ.. మూడు గంటల సినిమాకు రూ.5టికెట్ గా నిర్ణయించటం దేనికి నిదర్శనం? దీన్నేమంటారు? మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి.. గడిచిన మూడేళ్లలో చేసిందేమిటి? దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి.. అధిక ధరలకు అమ్మటం ఎందుకు? దీంతో.. మద్యం మత్తు నుంచి బయటకు రాకపోగా.. ఖరీదెక్కిన లిక్కర్ ను సొంతం చేసుకోవటానికి భారీగా ఖర్చు చేయటం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరింతగా దిగజార్చుకోవటం మాటేంటి?
ఇంగ్లిషులో బోధన చేస్తామంటే అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లిషు మీడియంను ఎవరూ కాదనటం లేదు. కానీ.. అమ్మభాషను పూర్తిగా వదిలేయటం సరికాదన్న వాదనను వదిలేసి.. ఇలా మాట్లాడటం దేనికి నిదర్శనం? కోర్టులో కేసులు వేస్తున్నారని చెబుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు..తమ పార్టీ నేతలు వేసిన కేసుల లెక్కను సీఎం జగన్ గుర్తుకు తెచ్చుకుంటే.. ఇవాల్టి రాజకీయాలకు మూలం ఎక్కడ మొదలైందన్నది ఇట్టే అర్థమవుతుంది. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల విషయానికే వద్దాం. సంక్షేమం చేయాల్సిందే. కానీ.. అప్పులు తెచ్చి కాదు కదా?
ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తినిపోతున్న వేళ.. ఇంకా సంక్షేమ జపాన్ని ఆలపించటం దేనికి సంకేతం? ఇలా జగన్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు సమాధానం చప్పున చెప్పే పరిస్థితి. అలాంటి వేళ.. చెడిపోయిన రాజకీయాలంటూ చెప్పే మాటల్ని విన్నంతనే ఏపీ ప్రజలు చిరునవ్వులు చిందించే వైనం.. ఆయన సంధించే ప్రశ్నలకు సమాధానాలుగా మారుతున్నాయి. ఇవన్నీ సీఎం జగన్ గమనించరా? ఆయన ఏర్పాటు చేసుకున్న వందలాది సలహాదారులు ఏం చేస్తున్నట్లు?