Begin typing your search above and press return to search.
నరసాపురంపై వైసీపీ సైలెంట్.. జనమే మాట్లాడుతున్నారు..!
By: Tupaki Desk | 22 Jan 2022 6:40 AM GMTతాజాగా ఏపీ వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. వైసీపీ రెబల్ ఎంపీ.. కనుమూరి రఘురామకృష్ణరాజు.. పార్టీపై దూకుడుగా ఉన్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఆయనను కార్నర్ చేసేందుకు.. కొన్ని రోజులు నాయకులు ప్రయత్నించినా.. తర్వాత మాత్రం.. సైలెంట్ అయ్యారు. అయితే.. రఘురామ ఏదో కేసులు పెడుతున్నారని.. కౌంటర్ కామెంట్లు చేస్తున్నారని.. అనుకున్నా.. అది కాదనే విషయం బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వైసీపీ నాయకులకు రఘురామే పెట్టుబడి పెట్టారని అంటున్నారు.
అందుకే .. ఈ నియోజకవర్గాల నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉంటున్నారట. అయితే.. పార్టీ అధిష్టానం మాత్రం దూకుడు పెంచాలని స్థానిక నేతలకు సూచించింది. కానీ, ఎవరూ మాట్లాడడం లేదు. ఎన్నికలు వచ్చాక అన్నీ మేం చూసుకుంటాం.. అని క్షేత్రస్థాయిలో నాయకులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం.. నియోజకవర్గంలో అంతా సైలెంట్ వాతావరణమే నెలకొంది. ఎక్కడా ఎవరి ఊసూ వినిపిం చడం లేదు. అయితే.. ఇది.. రఘురామకు ప్లస్ అవుతుందని అనేవారు.. మైనస్ అవుతుందని అనే వారు కూడా కనిపిస్తున్నారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో రఘురామ విషయం నేతలకంటే.. ఎక్కువగా ప్రజల మధ్య చర్చగా మారింది. ఆయనకు సింపతీ ఉందని, ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టడం.. వంటివి చర్చకు వస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ప్లస్ ఎంత ఉందో.. మైనస్ అంతకు మించి కనిపిస్తోంది. సొంత పార్టీలోనే రెబల్‌గామారడాన్ని క్షత్రియ సామాజిక వర్గం జీర్ణించుకోలేక పోతోంది. అంతేకాదు.. జగన్ బెయిల్ రద్దు చేయించేలా కోర్టుకు వెళ్లడం.. కూడా వారికి నచ్చడం లేదు.
ఇక, నియోజకవర్గానికి వస్తే.. తనను కొడతారని.. చంపేస్తారని... భయపడుతుండడాన్ని కూడా.. వారు తప్పు పడుతున్నారు. వై.-కేటగిరీ భద్రత ఉన్నప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే.. మొత్తంగా చూస్తే.. వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉంటూనే.. రఘరామ విషయాన్ని ప్రజలకే వదిలేశారని తెలుస్తోంది. రాజకీయాల్లో ఇదొక న్యూ ట్రెండ్ అని అంటున్నారు పరిశీలకులు. మరి చివరకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.