Begin typing your search above and press return to search.
షర్మిల పాదయాత్రను సక్సెస్ చేసేదెవరు..? పార్టీలపై ప్రభావమెంత..?
By: Tupaki Desk | 19 Oct 2021 10:30 AM GMTనిరుద్యోగ యువతకు న్యాయం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీలో సందడి తగ్గినట్లయింది. ప్రారంభంలో హల్ చల్ చేసినా ఆ తరువాత ఎలాంటి హడావుడి చేయకుండా పార్టీ నాయకులు కామ్ గా ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులతో నామినేషన్ వేస్తామని చెప్పిన షర్మిల ఆ పార్టీ తరుపున ఒక్కరు కూడా నామినేషన్ కేంద్రానికి రాలేదు. అంతకుముందు హుజూరాబాద్లో నిరుద్యోగులు చనిపోతే స్వయంగా వెళ్లి పరామర్శించిన ఆమె ఇక్కడ పోటీ చేయనట్లేనని క్లారిటీ వచ్చింది. అయితే షర్మిల తాజాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు కూడా రెడీ అవుతుననాయి. ఈ తరుణంలో షర్మిల పార్టీ ప్రభావం ఎంత మేరకు ప్రభావం చూపుతుందోనని ఆసక్తి చర్చ తీవ్రమైంది.
తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు వేడిగానే ఉంటున్నాయి. వరుసగా ఎన్నికలు రావడంతో అధికార పార్టీకి ఇక్కడ సవాల్ గా మారుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లు ఏ పార్టీ నుంచి పోటీ లేకున్నా ఆ తరువాత ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు ఎన్నికల్లో విజయం సాధించడంతో మొత్తంగా పట్టుకోసం పోరాడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సైతం కొత్త పాలకవర్గాన్ని నియమించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇదే సమయంలో వైఎస్ కూతురు షర్మిల నూతన పార్టీని నెలకొల్పారు. వైఎస్ షర్మిల అధ్యక్షతన ‘వైఎస్ఆర్సీపీ తెలంగాణ’ పార్టీని ఏర్పాటు చేసి వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే పార్టీలో పెద్ద తలకాయలు ఎవరూ కనిపించకపోయినా ఒంటరి పోరాటం చేస్తోంది షర్మిల.
హుజూరాబాద్లో ఒకవైపు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎలాంటి హడావుడి చేయని షర్మిల మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. 400 రోజులు చేపట్టే షర్మిల పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. మొత్తం 4000 కిలోమీటర్లు 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు వైసీపీటీ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాట్లకు రెడీ అవుతున్నారు.
షర్మిలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. ఆమె వైసీపీ తరుపున పాదయాత్ర, బస్సుయాత్రలు చేశారు. మానసికంగా ఇంత పెద్ద బాధ్యతను నెరవేరుస్తారని అంటున్నారు. అయితే ఆమె పాదయాత్ర పూర్తి చేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్ని పరిస్థితుల్లో షర్మిల ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందోనని చర్చించుకుంటున్నారు. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో షర్మిల పాదయాత్ర ప్రజలపై ప్రభావం ఉంటుందా..? అన్న చర్చ సాగుతోంది.
షర్మిల పార్టీకి అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయంగా పార్టీకి బలం లేదనే తెలుస్తోంది. అయితే కొద్దొ గొప్పో రాజకీయ బలం ఉంటే ఇతర పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ఏడేళ్లుగా టీఆర్ఎస్ వైపే ఉన్న జనాలను ఇప్పుడిప్పుడే బీజేపీ తనవైపు పలు రకాల మార్గాలతో తన వైపు మలుచుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తోంది. కానీ కేవలం అభిమానులతో మాత్రమే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుందా..? అని చర్చించుకుంటున్నారు.
అయితే షర్మిల తెలంగాణ మొత్తంగా పాదయాత్ర చేపట్టినా స్థానికంగా ఉన్న నాయక బలంతో అక్కడి ప్రజలను పాదయాత్రకు తీసుకొచ్చే వీలుంటుంది. కానీ కనీసం కార్యకర్తలు బలంగానే ఆమె పార్టీలో పాదయాత్రను ఏవిధంగా ఆదరిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. కానీ షర్మిల ఒంటరి పోరాట ధైర్యసాహసాలు చూసి తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.