Begin typing your search above and press return to search.
అమెరికా ఫస్ట్ లేడీ పై నెటిజన్స్ ఆగ్రహం ... అందరూ మీలాగానే చేశారా !
By: Tupaki Desk | 19 Jan 2021 12:38 PM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి కాల సమయం మరికొద్ది గంటల్లో ముగియబోతుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20 న ప్రాణాస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇదిలా ఉంటే .. అధినేతగా ట్రంప్ కొనసాగినన్ని రోజులు కూడా పలు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ పలుమార్లు వార్తల్లో నిలుస్తూ వచ్చారు.
ఇక తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయినప్పటికీ నేటికీ తన ఓటమిని అంగీకరించలేదు. కొద్ది రోజుల క్రితం ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేయడం.. ఆ తర్వాత ట్రంప్ పై అభిశంసన ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇక అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే.
ఇక తాజాగా ప్రస్తుత ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పై కూడా నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. వైట్ హౌస్ సంప్రదాయలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా దంపతులు మీ విషయంలో ఎంత గౌరవంగా.. హుందాగా ప్రవర్తించారు.. మరి మీరేంటిలా అని ప్రశ్నిస్తున్నారు. అసలు సంగతేంటి అంటే .. ఆమె భవిష్యత్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ను ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్ కి ఆహ్వానించలేదు.
అధికార పరివర్తనలో భాగంగా ప్రస్తుత ఫస్ట్ లేడి, నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కన్నా ముందే భవిష్యత్ ఫస్ట్ లేడీని ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్ కి ఆహ్వానిస్తారు. బ్రెస్ ట్రూమన్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం మిషెల్ ఒబామా వరకు అందరు పాటించారు. ఇక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన భర్త పౌరసత్వానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి.. మిషెల్ ఒబామా వాటిని మనసులో పెట్టుకోకుండా , 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామా, తన భర్తతో కలిసి వెళ్లి మెలానియాను సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం మెలానియా ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. దీనితో ఆమెపై అమెరికా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.