Begin typing your search above and press return to search.

అప్పులు తెచ్చి.. డెవ‌ల‌ప్ చేశామా? సాయిరెడ్డీ.. నెటిజ‌న్ల కామెంట్‌

By:  Tupaki Desk   |   17 Dec 2021 7:30 AM GMT
అప్పులు తెచ్చి.. డెవ‌ల‌ప్ చేశామా?  సాయిరెడ్డీ.. నెటిజ‌న్ల కామెంట్‌
X
ఏపీ అప్పుల కుప్ప‌గా మారుతోంద‌ని.. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల నుంచి కేంద్రంలోని ఆర్థిక శాఖ వ‌ర‌కు వేలెత్తి చూపిస్తున్నాయి. ఇది వాస్త‌వం కూడా. ఎక్క‌డా ఎవ‌రికీ స‌మ‌యానికి జీతాలు ఇవ్వ‌డంలేదు. కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌డం లేదు. పంచాయ‌తీ నిధుల‌ను కూడా వాడేసుకున్నార‌న్న వాద‌న ఎలా నూ ఉంది. ఇక‌, కార్పొరేష‌న్ల‌ను అడ్డు పెట్టి రుణాలు సేక‌రించార‌నే వాద‌న కూడా ఉంది. అదేస‌మ‌యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ సొమ్ము రూ.400 కోట్లు కూడా తీసుకున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

వీటికితోడు ఆర్బీఐ.. ఎప్ప‌టిక‌ప్పుడు.. రుణాల ప‌రిమితి దాటిపోతున్నార‌నే హెచ్చ‌రిక‌లు కూడా చేస్తోంది. మ‌రోవైపు.. అప్పుల కోసం.. ఢిల్లీ చుట్టు తిరుగుతూనే ఉన్నారు. సో.. ఇవ‌న్నీ ఉన్నాయి క‌నుక‌నే.. ఏపీ అప్పుల పాలైంద‌ని.. వ్యాఖ్యలు వ‌స్తున్నాయి. అయితే.. ఘ‌న‌త వ‌హించిన వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఎంపీ.. విజ‌య‌సాయిరెడ్డి.. అప్పులపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ``అప్పులు.. అప్పులు.. అప్పులు.. అని అనుట‌యేల‌..! ఎవ‌రు మాత్రం అప్పులు చేయ‌డం లేదు? అగ్ర‌రాజ్యం అమెరికా కూడా అప్పులు చేస్తోంది. ఈ విష‌యం క‌నిపించ‌డం లేదా?`` అని ప్ర‌శ్న‌లు గుప్పించారు.

అంతేకాదు. ``ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అమెరికా.. త‌న రుణ ప‌రిప‌తిని పెంచుకునేందుకు 2.5 ట్రిలియ‌న్ల‌కు కాంగ్రెస్ అనుమ‌తి తీసుకుంది`` అని నొక్కివ‌క్కాణించారు. క‌రోనా స‌మ‌యంలో అగ్ర‌రాజ్యాలే అత‌లాకుత‌లం అయ్యాయి కాబ‌ట్టి.. అస‌లే అప్పుల్లో ఉన్న ఏపీ మ‌రోసారి అప్పు చేస్తే.. ఇంత బాధ‌ప‌డిపోతారెందుకు అని ప్ర‌శ్నించారు. నిజ‌మే! సాయిరెడ్డి చెప్పిన దాంట్లో .. 100 ప‌ర్సెంట్ నిజం ఉంది. క‌రోనా దెబ్బ‌తో మోడీ అంత‌టి కేంద్రమే అప్పులు చేసింది. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు.

అయితే.. ఈ అప్పులు తెస్తున్న వేలాది కోట్ల రూపాయ‌ల‌ను ఏం చేస్తున్నార‌నేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అప్పులుగా తెస్తున్న‌వాటితో.. ఏం చేస్తున్నారు? రోడ్లు వేస్తున్నారా? ఉద్యోగుల‌కు స‌రైన స‌మ‌యానికి వేత‌నాలు ఇస్తున్నారా? లేక‌పోతే.. వారు కోరినంత ఫిట్‌మెంట్ ఇస్తున్నారా? ఉద్యోగ క‌ల్ప‌న‌కు వాడుతున్నారా? లేక‌.. ప్రాజెక్టులు క‌డుతున్నాం.. క‌నిపించ‌డం లేదా? అంటారా? పోనీ.. ఇవ‌న్నీ కావు.. గ‌త ప్ర‌భుత్వం పెట్టిన బ‌కాయిలు తీర్చేస్తున్నాం.. అని చెబుతారా? కాదుకాదు.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు.. పింఛ‌న్ల‌ను రూ.3000ల‌కు పెంచేశాం అని చెబుతారా? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌,

కానీ.. ఇవేవీ.. క‌నిపించ‌డం లేదు. కేవ‌లం అప్పులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. అందుకే.. ప్ర‌తి ఒక్క‌రూ ఏపీని అప్పుల ప్ర‌దేశ్‌గా పిలుస్తున్నారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌లో మీరు అడిగిన ప్ర‌శ్నకే.. నిర్మ‌లా సీతారామ‌న్ క‌ర్ర‌కాల్చి వాత‌పెట్టిన‌ట్టుగా.. మీకు ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ లోపించింది. అప్పుల కుప్ప‌గా మారుతున్నారు? అని దెప్పిపొడ‌వ‌లేదా? సార్‌.. అంటున్నారు నెటిజ‌న్లు.. మ‌రి సాయిరెడ్డి.. ఉర‌ఫ్ వీసారెడ్డి.. ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.