Begin typing your search above and press return to search.
కేశినేని సార్.. మీరు ఎంపీనా.. ఎంపీటీసీనా..
By: Tupaki Desk | 13 July 2019 10:22 AM GMTవిజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నానిపై సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి. ``సార్ మీరు ఎంపీనా? లేక ఎంపీటీసీనా?``- అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల డ్యూటీ మీరు చేస్తే.. ఎంపీ డ్యూటీ ఎవరు చేస్తారు? సార్!! అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ను ప్రశ్నించేందుకు టీడీపీకి ప్రజలు 23 మందిని గెలిపించారు సార్.. మీరెందుకు సార్.. చిన్న దానికీ పెద్దదానికీ కూడా రెచ్చిపోతున్నారు! అని అంటున్నారు. తాజాగా గడిచిన మూడు వారాలుగా ఎంపీ కేశినేని.. ఏపీలోని జగన్ ప్రభుత్వంపై సటైర్లు పేలుస్తున్నారు.
తాజాగా ఏపీ సీఎం జగన్.. అవినీతితో మకిలి పట్టిన వ్యవస్థను కడిగేద్దాం.. అంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు, మంత్రుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు కూడా జగన్ అవినీతి లేని సమాజాన్ని స్తాపిం చాలని పిలుపు నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన కేశినేని.. జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తిగా మకిలి అంటుకున్న మీరు ముందుకు మకిలి వదిలించుకుని తర్వాత నీతులు వల్లించాలనే కోణంలో ట్విట్టర్‌లో కామెంట్లు చేశారు. అటు రాజకీయంగాను, ఇటు సోషల్ మాధ్యమాల్లోనూ ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
నిజానికి ఎంపీగా నాని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారని, కానీ, ఆయనను ఎంపీగా గెలిపించింది. ఏపీకి కేంద్రంనుంచి రావాల్సిన బకాయిలు, నిధులు , హక్కులు వంటివి తీసుకువస్తామని ఆశించామని కానీ, ఆయన ఎంపీటీసీ మాదిరిగా.. లోకల్ సమస్యలపై లోకల్ లీడర్లపై వ్యాఖ్యలు చేస్తున్నారని, మరి టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు దద్దమ్మలనే విధంగా నాని భావిస్తున్నారా? జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వారికి చేతకాదు. కాబట్టే తాను రంగంలోకి దిగానని ఆయన అనుకుంటున్నారా? అనే భావన కూడా కలుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు దద్దరిల్లుతున్నాయి.
ఇక నాని ఎంత మొత్తుకున్నా... గింజుకున్నా ఆయన్ను అటు చంద్రబాబు కాని... ఇటు చినబాబు కాని చివరకు ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్లు కాని ఆయన్ను పట్టించుకోవడం లేదు. బాబుపై ఉన్న అసంతృప్తితో అటు టీడీపీ వాళ్లపై కూడా నాని పరోక్షంగా సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే.