Begin typing your search above and press return to search.
మోసంపై మోడీ వ్యాఖ్యలు.. విరుచుకుపడ్డ నెటిజన్లు.. ఏమన్నారంటే
By: Tupaki Desk | 21 Oct 2021 2:30 AM GMTప్రధాని నరేంద్ర మోడీ చేసిన తాజా వ్యాఖ్యలపై.. నెటిజన్లు అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీ తిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా.. దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లు పేర్కొన్నారు. అవినీతి పరులు తప్పించుకోలేరని.. ఇప్పుడు దేశం మొత్తం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సంయుక్త సమావేశానికి గుజరాత్ నుంచి వర్చువల్గా హాజరైన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
''చిన్నదైనా, పెద్దదైనా అవినీతి అంటే మరొకరి హక్కుల్ని హరించడమే. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. జాతి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ప్రజల నుంచి దోచుకొని, దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా.. తాము కనికరం చూపించబోమని దేశం నమ్ముతోంది. ప్రభుత్వం ఇలాంటి వారిని అసలు విడిచిపెట్టదు`` అని మోడీ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గత ప్రభుత్వాలకు రాజకీయ, పరిపాలనా సామర్థ్యం రెండూ లేవని, ఇప్పుడు.. అవినీతిని పారదోలే పటిష్ఠ వ్యవస్థ, రాజకీయ సంకల్పం తమకున్నాయని అన్నారు.
మధ్యవర్తులు లేకుండానే.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందగలమని ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని చెప్పారు. ప్రజలు.. పారదర్శకమైన వ్యవస్థ, సమర్థవంతమైన పాలన కోరుకుంటున్నారని మోడీ చెప్పుకొచ్చారు. అయితే.. మోడీ చేసిన కొన్ని కామెంట్లపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ``దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా.. తాము కనికరం చూపించబోమని`` అన్న కామెంట్ ను ఎక్కువ మంది కోట్ చేసి.. ``తమరి హయాంలోనే నీరవ్ మోడీ.. , మోహెల్ చౌక్సీ, విజయ్ మాల్యా సహా అనేక మంది కోట్లకు కోట్లు ప్రజాదనాన్ని మోసం చేసి తప్పించుకున్నారని.. వీరిని ఇప్పటి వరకు తెప్పించలేక పోయారని.. ఇదేనా.. మీరు చెబుతోంది సార్!!`` అని చలోక్తులు రువ్వారు.
ఇంకొందరు.. ఇంకా గత కాలపు విమర్శలను వదిలి పెట్టరా మోడీజీ! అంటూ.. ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పరిపాలన పోయి,, ఏడేళ్లు అయిపోయింది. ఈ ఏడేళ్ల కాలంలో మీరే పాలన చేస్తున్నారని.. కాబట్టి మీ ప్రభుత్వం గురించి చెప్పుకొంటే బాగుంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపించింది. ఏదేమైనా.. మోడీ హయాంలో నే పలువురు.. బ్యాంకులను బురిడీ కొట్టించి దేశం విడిచి పోవడం.. వీరిని తీసుకు వచ్చేందుకు మోడీ నత్తనడక ప్రయత్నాలు చేయడం..వంటివి అందరూ గమనిస్తున్నారన్న విషయాన్ని నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తానికి మోడీకి మరోసారి నెటిజన్ల నుంచి విమర్శలు రావడం గమనార్హం.