Begin typing your search above and press return to search.

ఏంట‌మ్మా ర‌ఘురామా.. ఈ గోల‌.. న‌ర‌సాపురం జ‌నాల్ని ప‌ట్టించుకోరాదా?: నెటిజ‌న్ల కామెంట్‌

By:  Tupaki Desk   |   10 May 2021 5:30 PM GMT
ఏంట‌మ్మా ర‌ఘురామా.. ఈ గోల‌.. న‌ర‌సాపురం జ‌నాల్ని ప‌ట్టించుకోరాదా?:  నెటిజ‌న్ల కామెంట్‌
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు మ‌రోసారి .. సీఎం జ‌గ‌న్‌.. ఎంపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సొంత‌ పార్టీ అధినేత‌పైనే నిప్పులు చెరిగారు. సీబీఐ కేసుల్లో లంచాలు ఇచ్చార‌ని.. అందుకే కోర్టుల‌కు డుమ్మా కొడుతున్నా.. ఎవ‌రూ జ‌గ‌న్‌ను నిల‌దీయ‌లేక పోతున్నార‌ని.. రఘురామ సెల‌విచ్చారు. త‌న‌కున్న ఆంగ్ల ప‌రిజ్ఞానం తో.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శలు చేశారు. అదేస‌మ‌యంలో గ‌త సీఎం చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌ను కూడా ఉద‌హ‌రిస్తూ.. జ‌గ‌న్‌కు సంస్కారం లేదు.. బుద్ధి లేదు.. అని కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ర‌ఘురామ కామెంట్ల‌పై దాదాపు రెండు వంద‌ల మంది వ‌ర‌కు యూట్యూబ్‌లో రియాక్ట్ అయ్యారు నెటిజ‌న్లు. ర‌ఘురామ‌పై వారు కూడా ఎదురు కామెంట్లు చేశారు. అవేంటంటే.. ``మీరు ర‌చ్చ చేస్తున్నారు బాగానే ఉంది.. జ‌గ‌న్‌ను దొంగ అంటున్నారు ఇదీ బాగానే ఉంది. అయితే.. ఈ ఆరోప‌ణ‌లు.. ఈ ర‌చ్చ.. వంటివి సొంత గూటికి(ఏపీలోకి) వ‌చ్చి చేయొచ్చుగా?! పొరుగింట్లో ఎన్నాళ్లు ఉంటారు? ఎప్పుడైనా సొంత జిల్లాకు, సొంత రాష్ట్రానికి రావాల్సిందేగా!`` అని ప్ర‌శ్నిస్తున్నారు.,

మ‌రికొంద‌రు.. ``ఈ గోల ఏంటి ర‌ఘురామ రాజా.. న‌ర‌సాపురం జ‌నాలు నీమీద ఎంతో ప్రేమ‌తో ఓట్లేస్తే.. నువ్వు నీ సొంత అరుపులు, రాజ‌కీయాల కోసం.. ఢిల్లీలో కూర్చుని ప్ర‌జ‌ల‌ను రోడ్డున ప‌డేస్తావా?` అని ప్ర‌శ్నించారు. మ‌రికొందరు.. జ‌గన్‌కు బుద్ధి లేదు.. సిగ్గులేదు.. అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై న‌డిరోడ్డుపై న‌రికి చంపినా.. త‌ప్పులేద‌ని పిస్తోంది! అన్న వ్యాఖ్య‌లు ఇప్పుడు గుర్తుకు రావ‌డం ఏంటి? ర‌ఘుసార్‌? మ‌రి ఇంత సంస్కార హీన‌మైన వ్య‌క్తి.. నాయ‌కుడుగా ఉన్న వైసీపీలోకి ఎందుకు త‌మ‌రు చేరిన‌ట్టు? ఎందుకు వంగి వంగి ద‌ణ్ణాలుపెట్టి టికెట్ కోసం.. లోట‌స్ పాండ్ ద‌గ్గ‌ర గంట సేపు కారులోనే వెయిట్ చేసిన‌ట్టు?( మీరు మ‌రిచిపోయినా.. ఎవ‌రూ మ‌రిచిపోలేదు) అప్పుడు.. అంటే టికెట్ అడిగేట‌ప్పుడు.. జ‌గ‌న్ సంస్కారం గుర్తుకు రాలేదా? జ‌గ‌న్ పై ఉన్న కేసులు గుర్తుకు రాలేదా? అని నిల‌దీశారు.

అయితే.. ఇక్క‌డ ర‌ఘురామ రాజును వ్య‌తిరేకించేవారే కాదు.. స‌మ‌ర్ధించేవారు కూడా ఉన్నారు. కానీ, వీరు కూడా ద్వంద్వార్థంలో వ్యాఖ్య‌లు సంధించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఢిల్లీలో ఉంటూ.. ఏపీ స‌ర్కారుపై కామెంట్లు చేయ‌డం.. మేధావులు.. ఇత‌ర రాజ‌కీయ నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విష‌యం గ‌మ‌నార్హం.