Begin typing your search above and press return to search.
మీరు మారితే చాలదా.. సజ్జలా.. కుట్రలేముంటాయి!
By: Tupaki Desk | 22 Oct 2022 1:30 AM GMTఏపీలో ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేయాలని, లేకపోతే రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న దాష్టీకాలకు ముక్కుతాడు వేయాలన్నారు. సినిమా నటుడిని అడ్డుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు మభ్య పెడుతున్నారని ఎద్దేవాచేశారు. ఆ నటుడు తన అభిమానాన్ని తాకట్టు పెడుతున్నారని, ప్రజల దృష్టిమరల్చేందుకే ప్రతిపక్షాల అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అన్నిప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల కన్నా ముందే వికేంద్రీకరణ పూర్తిచేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మరోవైపు.. అమరావతి యాత్రకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలి: మంత్రి బొత్సఅమరావతి యాత్రకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఒక ప్రాంతానికే న్యాయం చేశారని తప్పుబట్టారు.
వికేంద్రీకరణతోనే అన్నిప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. విశాఖలో భూములను లాక్కుంటున్నారని విషప్రచారం చేస్తున్నారని, నిజంగా ఎవరైనా భూములు లాక్కుంటే వారిపై చర్యలు తీసుకుంటామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.
ఈ ఇద్దరు చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి ఆసక్తికర కామెంట్లు వెలువడ్డాయి. ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అనే బదులు.. మీరు మారితే సరిపోతుంది కదా! అని నెటిజన్లు సజ్జలను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. అసలు మూడు రాజధానులపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారా? అని కొందరు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందుగానే మూడు రాజధానులు ఏర్పాటు చేసినా.. అవి చట్టం ముందు నిలుస్తాయా సర్! అని ఇంకొందరు ప్రశ్నించారు.
ఇదంతా కూడా.. 'ఏదోలా' ఉందని..ప్రతిపక్షాలను అనుమానించలేమని.. మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇక, బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపైనా మండిపడుతున్నారు.
వరుసగామీడియాలో వస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. భూముల వ్యవహారంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి.? అని కొందరు నిలదీశారు. ఏదేమైనా.. ఇప్పుడు ఈ ఇద్దరు చేసిన కామెంట్లు వైసీపీకి బూమరాంగ్ అయ్యేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.