Begin typing your search above and press return to search.
ఏపీ మద్యం పాలసీ మాదిరే టికెట్ రేట్ల ధరలు పెంచటంలో ఆ లెక్క ఉందేమో?
By: Tupaki Desk | 29 Sep 2021 6:36 AM GMTఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయం అంటూ ఉండకూడదు కదా? ఏపీలో అమలు చేస్తున్న మద్యం పాలసీ గురించి తెలిసిందే. మద్యం తాగే దురలవాటు పోవాలని.. మద్యం తాగాలనే కోరికకు కళ్లాలు వేసేందుకు అద్భుతమైన ఆలోచన చేయటం తెలిసిందే. రూ.50 ఉండే మద్యం బాటిల్ ను ఏకంగా రూ.250కు పెంచేస్తే.. అలా పెంచేయటం ద్వారా మద్యాన్ని తాగే అలవాటు నుంచి తాగుబోతు తప్పుకుంటారన్న ఆలోచన భేష్ అయినప్పుడు.. పెద్ద హీరోల సినిమా టికెట్ల ధరల్ని మొదటి రోజున రూ.500.. రూ.వెయ్యి పెట్టేస్తే తప్పేముంది? అలా చేయటం ద్వారా.. పెద్ద హీరోల సినిమాల్ని చూడాలన్న ఆలోచన చచ్చిపోవాలన్న మంచి ఉద్దేశంతోనే అగ్రహీరోలంతా అలాంటి ఆలోచన చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎందుకు అనుకోకూడదు?
ఎన్టీఆర్ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా గతంలో టికెట్ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవన్న సజ్జల.. తన చిన్నప్పటి మాటల్ని మాట్లాడుతున్నారే తప్పించి.. మారిన కాలానికి తగ్గట్లేగా ఆయన అప్డేట్ కాలేదన్న సత్యం కనిపిస్తుంది. ఒకవేళ తెలుగు అగ్ర హీరోలంతా తమ సినిమా విడుదల సందర్భంగా భారీగా టికెట్లు పెంచటం ద్వారా సినీ అభిమానులకు.. సినీ పరిశ్రమకు చాలా మంచి పని చేశారనే చెప్పాలి.
ఎందుకంటే.. ఒక పెద్ద హీరోసినిమాకు మొదటి రోజు టికెట్ రూ.వెయ్యి అనుకుందాం. ఇంట్లో ముగ్గురు వెళ్లి చూడాలంటే రూ.3వేలు ఖర్చు చేస్తున్నాడని అనుకుందాం. అంటే.. పెద్దహీరో సినిమాను ఒకసారి చూడటానికి.. అది విడుదలైన రోజు చూసేందుకు రూ.3వేలు ఖర్చు చేస్తున్నట్లు. ఒకవేళ.. సజ్జలవారు చెప్పిన రూ.500 లెక్కనే తీసుకుంటే.. రూ.1500 ఖర్చు చేస్తున్నట్లు. మామూలు హీరోల సినిమాలు రూ.150 లేదంటే కొన్ని సినిమాలు.. తాజాగా విడుదలైన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని తీసుకుంటే రూ.200 వసూలు చేస్తున్నారు హైదరాబాద్ లో.
రూ.1500 పెట్టి పెద్ద హీరో సినిమారిలీజ్ కు వెళ్లే బదులు.. శేఖర కమ్ముల లాంటి వారి సినిమాల్ని రూ.600 పెడితే.. కనీసం మూడుసినిమాలు (మరో రూ.300 అదనంగా కలిపితే) చూసే అవకాశం ఉంటుంది కదా? ఎవరి జేబులో డబ్బులు ఎవరికి మాత్రం చేదు అవుతాయి.
అందరికి అన్ని లెక్కలు తెలుసు. ఈ కోణంలో చూసినప్పుడు.. ఏపీ మద్యం పాలసీ ప్రకారం తాగుడు లాంటి వ్యసనం నుంచి తాగుబోతుల్ని రక్షించటం కోసం చేస్తున్నపని లాంటిదే.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద హీరోలు.. తమ సినిమాల్ని చూడకుండా ఒక క్రమపద్దతిలో ప్రజలకు మేలు చేస్తున్నారేమో? అందుకే.. అలా రేట్లుపెంచేస్తున్నారేమో? ఇదే నిజమైతే.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వారు మేలు చేస్తున్నట్లే. ఎందుకంటే గుప్పెడు పెద్ద హీరోలతో పోలిస్తే.. మిగిలిన వారి సినిమాలే ఎక్కువగా విడుదలవుతుంటాయి. అలాంటి వాటికి కలెక్షన్లు పెరిగితే.. పరిశ్రమ మరింతగా వెలిగిపోతుంది కదా? ఈ లాజిక్కు సజ్జల లాంటి సలహాదారుల వారికి ఎందుకు తట్టటం లేదంటారు?