Begin typing your search above and press return to search.
జగన్ మీద కోపంతో నీ లొల్లి ఏంది షర్మిలా?
By: Tupaki Desk | 17 Dec 2021 9:33 AM GMTఅత్తమీద కోపం దుత్తమీద చూపించడం అంటే ఇదేనా.. షర్మిలమ్మా? అంటున్నారు నెటిజన్లు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ తనయ.. షర్మిలను నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. నిజానికి.. షర్మిలపై ఇంత రేంజ్‌లో దూకుడు చూపించే పరిస్థితి ఉండేదికాదు. కానీ, ఆమె తన కుటుంబంపై ఉన్న ఆగ్రహం.. తన సొంత అన్న.. ఏపీ సీఎం జగన్‌పై ఉన్న కోపాన్ని.. మీడియామీద చూపించడంతో.. నెటిజన్లు కూడా అదే రేంజ్‌లో ఆమెకు షాకులిస్తున్నారు. `ఇదేంది షర్మిలమ్మా?` అంటూ.. ఏకిపారేస్తున్నారు.
తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానంటూ.. ఆమె ఇక్కడ పార్టీ పెట్టింది. అయితే.. ఈ పార్టీ దినదిన గండంగా ఉంది. నిజానికి ఇంకా కన్ను కూడా తెరవని దశలోనే మొగ్గలోనే మాడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరూ పార్టీని పట్టించుకోవడం లేదు. ఎవరూ వచ్చి చేరడం లేదు. కనీసం ఆమె చేసే యాక్షన్‌కు.. రియాక్షన్ కూడా ఉండడం లేదు. ఇక, ఆమె వేస్తున్న ప్రశ్నలకు సమాధానమూ ఎవరూ చెప్పడం లేదు. దీంతో తీవ్ర అసహనంతో షర్మిల రగిలిపోతున్న మాట వాస్తవం. అయితే.. ఇదే సమయంలో అటు ఏపీలో తన సొంత అన్న తనకు చేసిన అవమానాన్ని ఆమె మరింత జీర్నించుకోలేక పోతోంది.
ఈ క్రమంలో మీడియా మీదకు పేపర్లు విసిరి.. మీడియాపై అరవడం.. తాజాగా ఆమెపై మరిన్ని విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. నిజానికి మీడియా అంటే.. రాజకీయాల్లో ఉన్నవారు.. తమకు ఇష్టం ఉన్నా లేకు న్నా.. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటారు. కానీ, షర్మిల మాత్రం.. దినపత్రికను మీడియా మీదకు విసిరేసి.. తన అక్కసు వెళ్లగక్కింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు సూటి ప్రశ్నలు సంధిస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మీడియాపై పేపర్ విసరడమేంది షర్మిలా.? అది కరెక్ట్ కాదు! అని అంటున్నారు. అంతేకాదు.. మీడియాలో ప్రముఖంగా కనిపించాలనే ఆరాటంతో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే.. ఏం ప్రయోజం ఉంటుందని పెదవి విరుస్తున్నారు.
కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తిట్టి పెద్ద లీడర్ అవ్వాలని చూస్తున్నావా? అంటూ.. సటైర్లు పేలుస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు తెలంగాణ ఉద్యమ సంగతులు తొవ్వి తీస్తున్నారు. అసలు ఉద్యమం జరిగినప్పుడు నువ్వ ఎక్కడున్నావ్ ... చెప్పు బిడ్డా! అని అడుగుతున్నారు. సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. ఉమ్మడి ఏపీ కోసం.. మీ కుటుంబం కుటుంబం మొత్తం.. ధర్నాలు చేయలేదా? అప్పుడు.. ఉద్యమ కారులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యమ కారులపై పోలీసుల లాఠీలు విరిగినప్పుడు.. నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? అంటున్నారు. అప్పుడు ఇదంతాజరిగింది మీ వల్ల కాదా? అని అంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో గుర్తుకు రాని రాజన్న రాజ్యం.. తెలంగాణలో పార్టీ..ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అన్న జగన్ ను గెలిపించేందుకు ప్రయత్నం చేశావే. మరి అప్పట్లోనేతెలంగాణ ప్రజలు గుర్తుకు రావాలి కదా! అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
ఏపీలో అన్న సీఎం అయినా.. కూడా నీకు ఎలాంటి పదవి ఇవ్వలేదు కాబట్టి.. ఇక్కడ పార్టీ పెట్టి.. ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నావు.. నీ పన్నాగాలు ఎవరికి తెలియవు? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నీ నక్కజిత్తులు నమ్మే తెలంగాణ ప్రజలు ఇక్కడ ఎవరూ లేరు.అని దుయ్యబడుతున్నారు.