Begin typing your search above and press return to search.

త‌మరు స‌చ్చీరులా.. ``వ‌ల్ల‌భ‌నేని వంశీ``

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:30 PM GMT
త‌మరు స‌చ్చీరులా.. ``వ‌ల్ల‌భ‌నేని వంశీ``
X
రాజ‌కీయాల్లో నేత‌ల వ్యాఖ్య‌లు కోట‌లు దాటుతున్నాయి. నాయ‌కులు తాము న‌డిచి వ‌చ్చిన బాట‌ను పూర్తిగా మ‌రిచిపోయి.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి నాయ‌కులు.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు.. త‌మ పంథా మార్చుకుంటున్నారు. అయితే.. వీటిని నాయ‌కులు మ‌రిచి పోతున్నా.. ప్ర‌జ‌లు మాత్రం మ‌రిచిపోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా.. రాష్ట్ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ టీడీపీ మాజీ నాయ‌కుడు.. టిక్నిక‌ల్‌గా.. ఆ పార్టీ ఎమ్మెల్యే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్యాఖ్య‌లు.. వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ వివాదంలో వంశీ జోక్యం చేసుకుని.. తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు.

వంశీ విష‌యాన్ని చూస్తే.. ఆయ‌న రాజ‌కీయం అంతా కూడా దివంగ‌త ఎన్టీఆర్ చ‌నిపోయిన త‌ర్వాతే.. ప్రారంభ‌మైంది. అంటే.. వంశీ రాజ‌కీయాలు.. ప్ర‌స్తుత చంద్ర‌బాబు హ‌యాంలోనే కొన‌సాగాయి. అంతేకా దు.. ఇప్ప‌టి వ‌ర‌కు వంశీకి బీ ఫాం ఇచ్చింది కూడా చంద్ర‌బాబే. అంతేకాదు.. ఎంతో మంది సీనియ‌ర్లు పునాదులు వేసి.. టీడీపీ అంటే.. గ‌న్న‌వ‌రం.. గ‌న్న‌వ‌రం అంటే.. టీడీపీ అనేలా.,. తీర్చిదిద్దిన ఈ నియోజ క‌వ‌ర్గంలో.. వ‌ల్ల‌భ‌నేని వంశీ గెలుపు గుర్రం ఎక్కారు. ఇదే స‌మ‌యంలో స్థానికంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం మొత్తం కూడా వంశీకి క‌లిసి వ‌చ్చింది.. అంటారు స్థానిక టీడీపీ నేత‌లు.

మ‌రి ఇలా.. వంశీ ఎవ‌రి పునాదుల‌పై రాజ‌కీయ గూడు నిర్మించుకున్నారో.. అంద‌రికీ తెలిసిందేన‌ని అంటున్నారు. అంతేకాదు.. 2014-19 వ‌ర‌కు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి అధికార ప‌క్షం నాయ‌కుడిగా.. వంశీ.. ప్ర‌స్తుతం సీఎం.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేశారో.. అంద‌రికీ తెలిసిందేన‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ.. యూట్యూబుల్లో ఉన్నాయ‌ని అంటున్నారు. ఎవ‌రూ అన‌ని మాట‌ల‌ను, అన‌లేని మాట‌ల‌ను కూడా వంశీ అప్ప‌ట్లో జ‌గ‌న్‌పైనా.. వైసీపీపైనా సంధించారు. `అన్నం తినే వాళ్లు ఎవ‌రూ వైసీపీలో ఉండ‌ర‌ని.. చేర‌ర‌ని`` వంశీ వ్యాఖ్యానించారు.

అయితే.. ఇప్పుడు.. అదే వంశీ.. ప్ర‌స్తుతం వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న వంశీ.. త‌ర్వాత‌.. అనూహ్యంగా వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుమారుడు లోకేష్‌పై విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో మీరు వైసీపిని తిట్టిపోశారు క‌దా.. అంటే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు అలా అనిపించాడు.. అని చెబుతున్నారు. మ‌రి రేపు టీడీపీఅ ధికారంలోకి వ‌చ్చాక‌.. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉంటే.. అప్పుడు కూడా జ‌గ‌న్ అన‌మ‌న్నాడు.. అందుకే.. చంద్ర‌బాబును, లోకేష్‌ను అప్ప‌ట్లో తాను తిట్టిపోశాన‌ని చెబుతారా? అనేది ప్ర‌శ్న‌.

ఇక‌, వంశీ వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తున్న మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు.. వంశీ ఏమ‌న్నా.. స్వ‌లాభం చూసుకోని సుద్ద‌పూసా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న ఒక నిర్మాత‌.. అంటే.. వ్యాపార వేత్త‌. లాభాలు చూసుకునే వ్య‌క్తి. సో.. ఆయ‌న అన్నీ వ్యాపారంగానే చూస్తారు. ఈ క్ర‌మంలో ఆయ‌నేమీ త‌క్కువేమీ కాద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అధికారం అండ చూసుకున్నారో.. లేక ఏమో.. వంశీ.. నంద‌మూరి బాల‌య్య‌, ప‌రిటాల సునీత‌, లోకేష్‌, ప‌వ‌న్‌ల‌పై స‌టైర్లు వేస్తున్నారు. బాగానే ఉంది. కానీ, టీడీపీ బీఫాంపై గెలిచిన వంశీ.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. త‌న స‌త్తా ఏంటో నిరూపించుకోవ‌చ్చు క‌దా.. అంటున్నారు మేధావులు.

మ‌ళ్లీ దానికి కండిష‌న్లు పెట్ట‌డం ఎందుకు? లోకేష్‌, చంద్ర‌బాబు కానీ.. త‌న‌పై నిల‌బ‌డితే త‌క్ష‌ణ‌మే రాజీనా మా చేస్తాన‌ని చెబుతున్నార‌ని.. ఇలాంటి కండిష‌న్లు ఎందుకు అని అంటున్నారు విశ్లేష‌కులు. టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. ముందుగానే ఊహించుకున్న వంశీ గ‌త ఎన్నికల స‌మ‌యంలో వైసీపీ నాయ‌కు డు.. వెంక‌ట్రావ్‌ను ఇంటికి వెళ్లి బెదిరించ‌లేదా..? అని ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. వంశీ ఇన్ని మాటలు అనేవాడా? అని అంటున్నారు. మొత్తంగా.. వంశీ.. వ్యాఖ్య‌లు రాజ‌కీయం.. కూడా ఇప్పుడు ఆయ‌న‌కే బూమ‌రాంగ్‌గా మారిన విష‌యం గ‌మ‌నార్హం.