Begin typing your search above and press return to search.
వైసీపీ మంత్రి... 2022 బిగ్ జోక్
By: Tupaki Desk | 23 July 2022 9:42 AM GMTఆన ఇంటిపేరు కాకాణి. వంటి పేరు గోవర్ధనరెడ్డి. ఆయన చాలానే కాకమ్మ కధలు చెబుతారు అని ప్రత్యర్ధి టీడీపీ వారు ఇప్పటిదాకా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇపుడు నెటిజన్లు కూడా అదే తీరున ఒక రకంగా కామెంట్స్ తో చెలగాట ఆడుతున్నారు. ఇంతకీ ఘనత వహించిన వైసీపీ వ్యవసాయ మంత్రి గారు ఏమి చెప్పారు ఏమా కధ అంటే చాలానే ఉంది.
ఆయన వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే విషయంలో చాలా సమర్ధింపు ధోరణిలో మాట్లాడారు. ఒక విధంగా ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వంలో మంత్రిగా ఆయన తన వాదనను అలా బలపరచుకోవచ్చు. అయితే అసలు నిజాలు అన్నీ జనాలకు పూర్తిగా ఒకటికి పదిసార్లు తెలిసిపోయాక కూడా ఇలాంటి మాటలు మాట్లాడితేనే సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురి అవుతారు అని అంటున్నారు.
ఇంతకీ మంత్రిగారు ఏమన్నారు అంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడం చాలా మంచిదే అని. ఇలా చేయడం వల్ల రైతుల మీద ఒక్క రూపాయి కూడా భారం పడని కూడా భరోసా ఇచ్చేస్తున్నారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలీ అంటే కరెంట్ లోడ్ ఎంతో తెలియాలని అది తెలుసుకునేందుకే మీటర్లని బిగిస్తున్నామని భేషైన మాట చెప్పుకొచ్చారు.
ఇక విద్యుత్ బిల్లులు నేరుగా రైతుల ఖాతాలలోకి వేస్తామని, ఆ మీదట వారు తాముగానే చెల్లించాల్సి ఉంటుందని మంత్రి అంటున్నారు. ఇంతలా చక్కగా తాము అన్నీ ఆలోచించి మోటార్లకు మీటర్లను బిగిస్తూంటే టీడీపీ జనసేన అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నాయని కాకాణి ఘాటు కామెంట్స్ చేశారు.
సరే మంత్రి గారి వెర్షన్ ఆయనది. ఆయన సర్కార్ వారి తరఫున చెప్పాల్సినదే చెబుతారు. అంతా మన మంచినే అన్నట్లుగా చెబుతారు. కానీ అసలు నిజాలు జనాలందరికీ తెలుసు కదా అని అంటున్నారు. అదేమిటి అంటే ఇలా మోటార్లకు మీటర్లు బిగిస్తేనే కదా మీరు అప్పులు చేసుకునేందుకు ఎక్కువగా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇస్తామని కేంద్ర పెద్దలు షరతు విధించారు అని నెటిజన్లు అంటున్నారు.
నిజానికి మోటార్లకు మీటర్లను బిగించడం అన్నది అద్భుతమైన స్కీమ్ అయితే పొరుగునే ఉన్న తెలంగాణాలో దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. మోడీ మాట ఏ కోశానా వినని విపక్షాలు సైతం ఈ ప్రతిపాదనకు నో చెబుతున్నాయి కదా అని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఏతా వాతా తేలేది ఏంటి అంటే రైతులకు మేము మేలు చేస్తున్నామని మంత్రి గారు మహా గొప్పగా చెప్పుకుంటున్న మోటార్లకు మీటర్ల స్కీమ్ లో అప్పుల తిప్పలే అసలైన పరమార్ధం అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇలా వాస్తవం ఉంటే కవరింగులు ఎందుకు కాకాణి మాస్టారూ అని కూడా ఎకసెక్కమాడుతున్నారు. ఈ విషయంలో ఏ ఒక్క రైతునైనా లేక రైతుల తరఫున పాటుపడే వారిని అయినా వైసీపీ పెద్దలు ఒప్పించగలరా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాకాణి వారు బాగానే చెప్పారు. ఆయన శాఖకు తానున్న పార్టీకి న్యాయం చేశారు అంతే అనుకోవాలి మరి.