Begin typing your search above and press return to search.
జనంకన్నా.. స్వామి ముఖ్యం.. జగన్ నిర్ణయంపై నెటిజన్ల ఫైర్
By: Tupaki Desk | 19 July 2022 5:30 PM GMTఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి మూడే ళ్లు అయినా.. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ఆయన మనసు పెట్టింది లేదు. ఎక్కడైనా ఎవరైనా.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే.. వెంటనే..విమర్శలు చేయడం తప్ప.. సీఎం జగన్ ఏమీ చేయలేక పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ దెబ్బతో రోడ్లపై తిరిగేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. రోడ్లు వేయాలని.. డిమాండ్లు వస్తున్నాయి.
కానీ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు.. నిధులు ఇచ్చాం.. టెండర్లు పిలుస్తున్నాం.. అని కబుర్లు చెబుతున్నారు. కానీ, ఇదే సమయంలో విశాఖలోలని శారదా పీఠాధిపతి.. స్వరూపానందేంద్ర ఆదేశించారో.. లేక.. జగనే ఆయన పట్ల స్వామి భక్తిప్రదర్శించాలని అనుకున్నారో తెలియదు కానీ.. ఆ పీఠానికి దారితీసే.. మార్గాన్ని(రోడ్డు) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
చినముషిడివాడ ప్రధాన రహదారిలో శారదా పీఠం ప్రధాన ప్రవేశమార్గం నుంచి దోబీఖానా వరకు 60 అడుగుల వెడల్పుతో పనులు చేపట్టారు. ఒకేసారి పది లారీలతో చిప్స్ తెప్పించి యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. రోడ్డు పనులకు ఇన్ని వాహనాలు రావడం ఇదే మొదటిసారి కావడంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
పనులన్నీ 48 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. ఇంతే వేగం ఇతర రహదారుల విషయంలో చూపిస్తే సంతోషమే. కానీ, విశాఖలోనే ప్రధాన రహదారులకు చాన్నాళ్లుగా మోక్షం దొరకడం లేదు. అందులో ఒకటి ‘పెందుర్తి- పులగాలిపాలెం’ రహదారి. ఈ ఏడాది ప్రారంభంలోనే పీఠం కోసం భీమిలి మండలంలో 15 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కేటాయించారు.
తాజాగా చినముషిడివాడలో గల పీఠానికి వెళ్లే మార్గంలో 480 మీటర్ల పొడవైన మట్టి రోడ్డును తారురోడ్డుగా మార్చడానికి రూ.96 లక్షలు కేటాయించారు. గత జూన్ 16న ఈ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగ్గా, వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రస్తుతం ఆగమేఘాలపై దానిని పూర్తిచేస్తున్నారు. ఈ విషయంపైనే నెటిజన్లు ఫైరవుతున్నారు. స్వామిపై ఉన్న భక్తి.. ఓట్లేసి గెలిపించిన తమపై లేదా.. జగనన్నా..! అని నిలదీస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.