Begin typing your search above and press return to search.
సిల్లీగా సెల్ఫీలు.. మంత్రి రోజా వ్యవహారంపై నెటిజన్ల ఫైర్
By: Tupaki Desk | 4 July 2022 10:50 AM GMTఆమె బాధ్యతగల.. మంత్రి. ఏపీ పర్యాటక శాఖకు బాధ్యత వహిస్తున్నారు. ముఖ్యంగా దేశాధినేత ప్రధాని మో డీ ఎంతో ఇష్టంగా పాల్గొన్న సభ. అదేసమయంలోఎంతో బిజీగా ఉండే.. మెగా స్టార్ చిరంజీవి హాజరైన కార్య క్రమం. మరి ఇంత సీరియస్ కార్యక్రమంలో మంత్రి రోజా.., చాలా సిల్లీగా వ్యవహరించారని అంటున్నారు నెటిజన్లు.
ఫక్తు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని.. వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో ఈ సెల్ఫీల గోలేంటంటూ.. నిప్పులు చెరుగుతున్నారు.
ఏం జరిగిందంటే.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. భీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన కార్య క్రమంలో అత్యంత తక్కువ మందిమంత్రులను అనుమతించారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో రోజా కూడా వేదికపైకి ఎక్కారు. అయితే.. కార్యక్రమంలో గంభీరంగానో.. లేక కార్యక్రమం ఉద్దేశాన్నోఆమె ప్రతి బింబించకుండా.. సెల్ఫీలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి.. ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు రాజా ప్రాధాన్యం ఇచ్చారు. ఫస్ట్ టైమ్ సెల్ఫీ సరిగా రాకపోవడంతో మరోసారి ప్రధానిని పక్కకు పిలిచి మరీ.. రోజా సెల్ఫీ దిగారు. ఇక, ఇదే కార్యక్రమానికి హాజరైన అత్యంత మొహమాటస్తుడు చిరంజీవితోనూ.. రోజా సెల్ఫీలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనతోనూ వరుస పెట్టి.. సెల్ఫీలు దిగారు. దీంతో మంత్రి హోదాలో ఉంటూ.. ఇదేం పని అంటూ..
నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెల్ఫీ తీసుకోవడం తప్పుకాకపోయినా.. ఇంత కీలకమైన కార్యక్రమాన్ని కూడా ఇలా చేయడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా మంత్రి హోదాలో ఉండి!! అని అంటున్నారు. మరి దీనిపై రోజా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.