Begin typing your search above and press return to search.
సానియామిర్జాపై నెటిజన్ల ఫైర్.. అందుకేనట?
By: Tupaki Desk | 12 Nov 2021 3:30 PM GMTటీ20 క్రికెట్ వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. సెమిఫైనల్స్ భాగంగా ఇటీవల పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ పాకిస్థాన్ 176 పరుగులను చేసింది. పోయాబ్ మాలిక్ ఒక్క పరుగే అవుట్ అయినప్పటికీ జట్టు భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించడంలో ఆస్ట్రేలియా జట్టు మొదట్లో ఇబ్బంది పడింది.
ఒకనొక సమయంలో విజయం పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లింది. ఆస్ట్రేలియా ఓడిపోతుందనుకున్న దశలో క్రీజ్‌లోకి దిగిన మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ పరుగుల వరద సృష్టించారు. భారీ షాట్లతో పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 177 పరుగుల లక్ష్యాన్ని అందుకొని ఫైనల్లోకి దూసుకెళ్లింది.
అయితే పాకిస్థాన్ జట్టుకు మద్దతుదారులిగా భారత టెన్నిస్ స్టార్ సానియామిర్జా దుబాయ్ స్టేడియంలో కన్పించారు. పాకిస్థాన్ జట్టు ఆడుతున్నంత సేపు ఆమె ఆ జట్టుకు సపోర్టు చేశారు. ఆమె భర్త షోయాక్ మాలిక్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పేలవ ప్రదర్శన చేశారు. అయినప్పటికీ జట్టు భారీ స్కోర్ చేయడంతో ఆమె ఆ జట్టుకు చీర్స్ చెప్పారు. కాగా ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి పాలైంది.
ఇక్కడే నెటిజన్లు సానియా మీర్జా తీరును తప్పుబడుతున్నారు. ఆమె తన భర్త ఆడుతున్న జట్టుకు మద్ధతు ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టకపోయినా ఒక విషయం మాత్రం ఆమెను నిలదీస్తున్నారు. దుబాయ్ లో భారత్ క్రికెట్ టీం పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలతో ఆడిందని గుర్తు చేస్తున్నారు.
ఈ ఐదింటిలో ఒక్క మ్యాచ్ కైనా సానియామీర్జా వచ్చి భారత టీంకు మద్దతు ఇచ్చారా? అంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాన్నే టార్గెట్ చేస్తూ సానియా మీర్జాను కార్నర్ చేస్తున్నారు. భారత ఉప్పు తింటూ పాకిస్థాన్ కు సపోర్టు చేస్తావా? అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు ఒక్క అడుగు ముందుకేసి సానియా మిర్జా ఆడే టెన్నిస్ టోర్నమెంట్లను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెను భారత పౌరురాలిగా గుర్తించొద్దని అంటున్నారు. సానియా పాక్ పౌరసత్వం తీసుకోవాలంటూ పలువురు హితవు పలుకుతున్నారు. మొత్తంగా సానియామీర్జా ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.