Begin typing your search above and press return to search.
ఆ ప్రకటన చేసి భారత్ బయోటెక్ తప్పు చేసిందా?
By: Tupaki Desk | 25 April 2021 8:30 AM GMTవ్యాపారం చేయాలి. కానీ.. అందుకు సమయం సందర్భం చాలా చాలా అవసరం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందన్నది తెలుగోళ్లంతా మోసుకు తిరుగుతున్న భారత్ బయోటెక్ సంస్థ తాజా ప్రకటనను చూసినంతనే కలుగక మానదు. ఇంతకాలం భారత్ బయోటెక్ ను పల్లెత్తు మాట అనేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఒకదశలో ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. వేలెత్తి చూపించిన వారిని ప్రశ్నించి.. ప్రజలంతా భారత్ బయోటెక్ వైపు ఉన్నారు. అంతేకాదు.. ఒక తెలుగు కంపెనీని దెబ్బ తీయటానికి కుట్ర పన్నుతారా? అని ప్రశ్నించినోళ్లు కూడా లేకపోలేదు.
కోవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ను తెలుగువారంతా భావోద్వేగ అనుబంధం ఉన్నట్లుగా భావించేవారు. అందుకు భిన్నంగా తాజాగా ఆ కంపెనీ ప్రకటన ఉంది. మే ఒకటినుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. భారత్ బయోటెక్ కేంద్రంతో పాటు.. రాష్ట్రాలకు.. ప్రైవేటు వారికి అమ్మాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా తన వ్యాక్సిన్ రేట్ కార్డును విడుదల చేసి షాకిచ్చింది.
దేశంలో లభ్యమవుతున్న కోవీషీల్డ్ ఇప్పటికే తన ధరల్ని ప్రకటించగా..తాజాగా ప్రకటించిన భారత బయోటెక్ ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. సీరం సంస్థ తయారు చేసిన కోవీ షీల్డ్ కేంద్రానికి ఒక్కో డోసు రూ.150కు అమ్మాలని నిర్ణయించటం తెలిసిందే. తాము ఉత్పత్తి చేసిన వాటిల్లో 50 శాతం కేంద్రానికి ఇచ్చి.. మిగిలినవి ప్రైవేటుకు అందించాలని నిర్ణయించారు. తమ కోవాగ్జిన్ ఒక డోసును కేంద్రానికి రూ.150 చొప్పున ఇవ్వాలని డిసైడ్ చేసిన భారత్ బయోటెక్.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.600 చొప్పున.. ప్రైవేటు సంస్థలకు రూ.1200 ఇవ్వాలని నిర్ణయించటం షాకింగ్ గా మారింది.
కోవీషీల్డ్ తో పోల్చినప్పుడు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర భారీగా ఉండటం గమనార్హం. విదేశాల్లో తమ టీకాను 15-20 డాలర్లకు అమ్మాలని నిర్ణయించినట్లుగా పేర్కొంది. అదే సమయంలో సీరం సంస్థ తన టీకాను కేంద్రానికి రూ.150.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400.. ప్రైవేటు సంస్థలకు రూ.600 చొప్పున అమ్ముతామని ప్రకటించటం తెలిసిందే. ఇలా చూసినప్పుడు భారత్ బయోటెక్ సంస్థ వారి తాజా ప్రకటన.. పూర్తి కమర్షియల్ గా ఉందన్నమాట వినిపిస్తోంది. ఒక ప్రైవేటు కంపెనీగా.. తాను తయారు చేసిన వస్తువుకు ధరను డిసైడ్ చేసుకోవటంలో స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాదనలేం. కానీ.. మరీ.. ఇంత వాణిజ్య ధోరణిలోనా? అన్న భావన.. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన రేట్ కార్డును చూసినంతనే కలుగక మానదు. ఈ ప్రకటన తర్వాత భారత్ బయోటెక్ మీద పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.