Begin typing your search above and press return to search.
దేశ సంపద ఎందుకు అమ్ముతున్నావంటే...నువ్వు హిందువు కాదా?.. ఇదే బీజేపీ ప్రశ్న
By: Tupaki Desk | 13 March 2021 8:52 AM GMTదేశంలో అత్యంత విలువైన సంస్థలను, పరిశ్రమలను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అమ్మ కానికి పెడుతున్న విషయం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. ఈ నేపథ్యంలో `ఎందుకు సార్.. దేశ సంపదను అమ్మకానికి పెడుతున్నారు?` అని ఎవరైనా ప్రశ్నిస్తే.. బీజేపీ నేతల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. వెంటనే వారు `నువ్వు హిందువు కాదా?` అని నిలదీస్తున్నారు. అంటే.. హిందువు కాని వారే.. మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం మాటున మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలనే ప్రధాన సూత్రం దాగి ఉండడం గమనార్హం.
దేశంలో గడిచిన ఆరేడు సంవత్సరాలుగా దేశంలోని అన్ని కీలక ప్రాజెక్టులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు నష్టాల్లో ఉన్నాయని తరచుగా కేంద్రంలోని మోడీ సర్కారు చెబుతోంది. ఇటీవల ఏకంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదని కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సహా అన్నింటినీ ప్రైవేటు పరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లక్షల కోట్ల విలువ చేసే ప్రజా సంపదను, ఈ దేశ సంపదను కారు చౌకగా `తమ వారికి` కట్టబెట్టేస్తున్నారు.
ఇక్కడ మరో చిత్రమైన పరిస్థితి ఏంటంటే.. ఇలా కారు చౌకగా వాటిని సొంతం చేసుకున్న ప్రైవేటు సంస్థలు వాటిని బ్యాంకుల్లో పెట్టి భారీ ఎత్తున అంటే దాదాపు ఐదు రెట్ల మేరకు రుణాలు తీసుకుంటున్నాయి. అనంతరం.. ఆ సంపదను విదేశాలకు తరలించేస్తున్నారు. అంటే.. సంస్థలు మనవి.. బ్యాంకుల్లో సొమ్ము మనది.. కానీ.. ప్రైవేటు సంస్థల అధిపతులు మాత్రం వాటిని సొంతం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఎవరైనా టీవీ చర్చల్లో ప్రస్తావించి నిలదీస్తే.. వెంటనే హిందూత్వ కార్డును బయటకు తీస్తున్నారు బీజేపీ నేతలు. `నువ్వు హిందువు కాదా.. `` అని ప్రశ్నిస్తున్నారు.
మరి ఇలా దేశ సంపదను అమ్ముకుంటూ పోతే.. అడిగేవారిని ఇలా ప్రశ్నించడం, దేశ ద్రోహులుగా చిత్రీకరించడం, వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. మరి ఇదేనా ఈ ప్రభుత్వం నుంచి కోరుకునేది. ఎక్కడకు వెళ్లినా.. ఇదే చర్చ సాగుతుండడం గమనార్హం. ముఖ్యంగా ఉదయం మార్నింగ్ వాక్‌ల నుంచి కాఫీ క్లబ్బుల వరకు ఎక్కడ ఏ ఇద్దరు చేరినా.. బీజేపీ పెద్దల వ్యవహార శైలి.. దేశ సంపదను తృణ ప్రాణంగా అమ్మేయడమే చర్చగా మారడం గమనార్హం.