Begin typing your search above and press return to search.
చంద్రబాబు బ్యాలెన్స్ ఎందుకు కోల్పోయాడు ?
By: Tupaki Desk | 8 March 2021 9:30 AM GMTక్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రోడ్డుషో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాలను నోటికొచ్చినట్లు నిందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. తన పాలనలో జరిగిన వ్యవహారాలను నిలదీసినందుకు ఓ వ్యక్తిని అందరిముందు గదమాయించి నోరు మూయించారు.
అమరావతి రాజధాని సెంటిమెంటు ఎందుకు లేదంటూ జనాలనే నిలదీశారు. పట్టిసీమ నీళ్ళు తాగుతున్న మీకు రోషం రావటంలేదా ? అంటూ మండిపడ్డారు. పైగా విజయవాడలో టీడీపీ గెలవలేకపోతే ఇక మొహం చూపించటం సాధ్యంకాదన్నారు. దాదాపు 20 నిముషాల పాటు మాట్లాడిన చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనబడుతోంది. ఒకవైపు జనాలను తిడుతునే మరోవైపు అదే జనాలను టీడీపీకి ఓట్లేయాలని ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది.
మామూలుగా జనాలను బతిమలాడుకుంటేనే ఓట్లేయటం అంతంతమాత్రం. అలాంటిది ఓటర్లను బెదిరిస్తే ఇక పార్టీకి ఎవరు ఓట్లెస్తారు ? ఇంతచిన్న విషయాన్ని కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు ఆలోచించటం లేదో అర్ధం కావటంలేదు. చంద్రబాబు జనాలతో మాట్లాడిన పద్దతి చూసిన తర్వాత పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయినట్లు అర్ధమైపోయింది. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో జనాల మూడ్ వైసీపీ వైపు సానుకూలంగా కనబడటం. ఇక రెండోది విజయవాడ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడి అల్లరవవ్వటం.
బెంగుళూరు, చెన్నైకి పాచిపనులు చేయటానికి వెళతారు కానీ అమరావతి పోరాటానికి మాత్రం రారా అంటూ జనాలను నోటికొచ్చినట్లు తూలనాడారు. తనకెందుకు ఓట్లేయరంటూ ఓటర్లను గద్దించటమే విచిత్రంగా ఉంది. బహుశా పార్టీ ఫీడ్ బ్యాక్ ప్రకారం పార్టీకి గెలిచే అవకాశాలు లేవని స్పష్టమయ్యుంటుంది. అందుకనే తాను చేసిన అభివృద్ధికి టీడీపీకి ఎందుకు ఓట్లేయరంటు నిలదీస్తున్నారు. అంటే జనాలు వైసీపీకి ఓట్లేయాలని డిసైడ్ అయిన విషయం చంద్రబాబుకు అర్ధమైందా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. మొత్తం ఈ కారణాలతోనే చంద్రబాబు బ్యాలెన్స్ కోల్పోయినట్లు అర్ధమైపోతోంది.