Begin typing your search above and press return to search.
తిడితే ఎవరైనా ఓటేస్తారా ?
By: Tupaki Desk | 9 March 2021 4:09 AM GMT‘మీకు స్వార్ధం ఎక్కువ..పిరికోళ్ళు..మీకసలు రోషమే లేదు’ ..ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా ? ఎన్నికల ప్రచారం సందర్భంగా జనాలను ఉద్దేశించి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. జనాలను బతిమలాడుకుంటేనే ఓట్లేసిది అనుమానం. అలాంటిది నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇంకెందుకు ఓట్లేస్తారు ? ఇంత చిన్న విషయం కూడా చంద్రబాబు ఎలా మరచిపోయారో అర్ధంకాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
తన హయాంలో రాష్ట్రాభివృద్ధికి తాను ఏమి చేశారో చెప్పుకుని ఓట్లడగటం పద్దతి. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిని జనాలకు వివరించి చెప్పాలి. అంతేకానీ మీకు అమరావతి అవసరం లేదా ? గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ గెలిస్తే అమరావతిని శాశ్వతంగా వాళ్ళకు రాసిచ్చేసినట్లే అని చెప్పటమంటే ఏమిటర్ధం ?
రైతులు అమరావతి కోసం పోరాటాలు చేస్తుంటే మీకసలు పట్టడం లేదా ? అని జనాలను నిలదీశారు. అమరావతి సెంటిమెంటు భూములిచ్చిన 28 గ్రామాల్లో కూడా పూర్తిగా కనబడటం లేదన్నది వాస్తవం. ఇది వాస్తవం కాబట్టే ఇటు గుంటూరు అటు విజయవాడ జనాలు రైతుల ఉద్యమాన్ని పట్టించుకోవటం లేదు. దీన్నే చంద్రబాబు తప్పు పడుతున్నారు. కేసుల కోసం భయపడుతున్నారా ? ఒక రోజు వెళ్ళి జైలులో కూర్చోలేరా ? జైలులో కూర్చుంటే ఏమవుతుంది ? అని జనాలను అడగటమే విచిత్రంగా ఉంది.
అవినీతి ఆరోపణలపై విచారణ జరిగితే తనకు జైలుశిక్ష పడుతుందన్న భయంతోనే కదా విచారణ జరగకుండా చంద్రబాబు కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటున్నది. ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరంలో అవినీతి లాంటి అనేక ఆరోపణలపై విచారణలు జరగకుండా చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి స్టేలు ఎందుకు తెచ్చుకున్నట్లు ? తాను మాత్రం జైలుకు వెళ్ళకూడదు, జనాలు మాత్రం వెళ్ళి జైల్లో కూర్చోవాలా ? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రేపటి పోలింగ్ లో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ గెలిస్తే అపుడు చంద్రబాబు ఏమి మాట్లాడుతారో చూడాలి.