Begin typing your search above and press return to search.

ముందుకు పోతే.. బావి... వెనుక‌కు పోతే నుయ్యి: ఇదీ బాబు ప‌రిస్థితి!

By:  Tupaki Desk   |   3 April 2021 7:30 AM GMT
ముందుకు పోతే.. బావి... వెనుక‌కు పోతే నుయ్యి:  ఇదీ బాబు ప‌రిస్థితి!
X
రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి ఏంటి? గ‌త 2019 ఎన్నిక‌ల ఎఫెక్ట్ నుంచి పార్టీ కోలుకో లేదు. స్థానికంలో మరింత‌గా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆశించిన విధంగా కాక‌పోయినా.. క‌నీసం గ‌త సార్వ ‌త్రిక స‌మ‌రంలో ఎదురైన ప‌రాభ‌వం నుంచి కోలుకుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, టీడీపీకి స్థానిక ఎన్నిక‌ల్లోనూ గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ క్ర‌మంలో మ‌రి వ‌చ్చే 2024 ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటి? ఆ ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే.. ఎలా ముందుకు సాగాలి? ఏ విధంగా వ్యూహాలు అమ‌లు చేయాలి? అనే విష‌యాలు టీడీపీ నేత‌ల‌ను త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురిచేస్తున్నాయి.

ఒంట‌రి పోరు స‌రికాదు!
గ‌త 2019 ఎన్నిక‌లు చూసుకుంటే.. టీడీపీ ఒంట‌రి పోరు చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మిత్ర‌ప‌క్షాల‌తో వైరం ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలో నిలిచింది. వాస్త‌వానికి టీడీపీకి ఎప్పుడూ కూడా ఒంట‌రి పోరు క‌లిసి రాలేదు. గ‌తంలో కూడా ఒంట‌రి గా బ‌రిలో నిలిచిన ప్ర‌తిసారీ.. పార్టీ ఓడిపోతూనే ఉం ది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షంతో క‌లిసి.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించు కున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌నేది వ్యూహంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సామాజిక వ‌ర్గాల ప‌రంగా!
ఓటు బ్యాంకు రాజ‌కీయాలు సామాజిక వ‌ర్గాల ప‌రంగా చీలిపోయిన నేప‌థ్యంలో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గం జ‌న‌సేన‌వైపు న‌డిచేందుకు రెడీగా ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైం ది. కాపులు ఎక్కువ‌గా ఉన్న వార్డుల్లో.. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కిం చుకున్నారు. ఈ నేప‌థ్యంలో కాపుల‌ను టీడీపీకి చేరువ చేసేందుకు ప‌వ‌న్‌తో మైత్రి చంద్ర‌బాబుకు ప్ర‌యోజ‌న‌మే. అయితే.. వీరు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న రిజ‌ర్వేష‌న్ అంశం.. బీసీలు-కాపుల‌కు మ‌ధ్య వివాదంగా ఉంది. ఈ క్ర‌మంలో కాపుల‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ నిలిస్తే.. బీసీలు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

అడ్డువ‌స్తోంది ఇవే..
గ‌త 2019 ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. అప్ప‌ట్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ తీర్మానం చేసిన నేప‌థ్యంలో బీసీలు ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మం లోనే కాపుల రిజ‌ర్వేష‌న్ ఇప్పుడు కూడా బాబుకు సంక‌టంగానే మారింది. అయితే.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో క‌నుక జ‌ట్టు క‌డితే.. ఉత్త‌రాంధ్ర‌ లోని మూడు జిల్లాల నుంచి గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు టీడీపీకి పున‌ర్‌ వైభ‌వం వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ, అదేస‌మ‌యంలో కాపు ట్యాగ్ ఎంచుకుంటే.. బీసీలు ఏమౌతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లోనే వారు టీడీపీకి దూరంగా జ‌ర‌గ‌డం వ‌ల్ల‌.. పార్టీ ఓడిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!
ఇక‌, ఇప్పుడు మ‌రోసారి కాపుల ను చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకుంటే.. బీసీల ఓటు బ్యాంకు ఏక‌ప‌క్షంగా జ‌గ‌న్ వైపు మ‌ళ్లుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సామాజిక వ‌ర్గాల ప‌రంగా చంద్ర‌బాబు బీసీల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగ‌ని.. కాపుల‌ను దూరం చేసుకున్నా.. ఇబ్బందులే. ఈ నేప‌థ్యంలో ఎటువైపు అడుగులు వేయాలి? అనేది టీడీపీ నేత‌ల‌కు త‌ల‌కుమించిన భారంగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బీసీల‌కు జై కొడుతున్నారు. ఇటీవల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో.. బీసీల‌కు ఎక్కువ‌గా ప‌ద‌వులు ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు టీడీపీ తీసుకునే నిర్ణ‌యం కీల‌కంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.