Begin typing your search above and press return to search.
కరోనా సమయంలో కూడా రాజకీయమేనా ?
By: Tupaki Desk | 6 May 2021 5:30 AM GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు కరోనా వైరస్ సమయంలో కూడా రాజకీయమే ముఖ్యమైపోయింది. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం కాదు బాధతోనే మాట్లాడుతున్నామంటూ పెద్ద రాజకీయమే చేస్తున్నారు. ఆచరణసాధ్యం కానీ డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లోనే చంద్రబాబు చేస్తున్న కరోనా రాజకీయం అర్ధమైపోతోంది.
తాజాగా మీడియాతో మాట్లాడుతు ప్రభుత్వం నిర్లక్ష్యంపై బాధతోనే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం పెట్టుకున్నట్లు చెప్పటమే విచిత్రం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పాలిట్ బ్యూరో సమావేశం పెట్టుకోవటం ఏమిటో ? సమావేశం పెడితే ఉపయోగం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ఇంతకీ విషయం ఏమిటంటే 18-45 ఏళ్ళవాళ్ళకి కూడా యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ వేయించాలంటు చంద్రబాబు పదే పదే డిమాండ్ చేయటంలో అర్ధమేలేదు. ఎందుకంటే టీకాలను సరఫరా చేయాల్సింది కేంద్రప్రభుత్వం.
ఉత్పత్తి చేయాల్సిన ఫార్మాకంపెనీలు కేంద్రం అధికారపరిధిలో ఉంది. ఫార్మాకంపెనీలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి టీకాల గురించి మాట్లాడారు. ఇప్పుడున్న డిమాండ్ కే టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు యాజమాన్యాలు స్పష్టంగా చెప్పేశాయి. కేంద్రం ఇచ్చిన ఆర్డర్లనే తాము సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నట్లు యాజమాన్యాలు చెప్పేశాయి. అందుకనే అన్నీ ప్రభుత్వాలు ముందు 45-60 ఏళ్ళవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఈ విషయాలన్నీ తెలిసికూడా మళ్ళీ 18 ఏళ్ళవాళ్ళకి యుద్ధప్రాతిపదికన టీకాలు వేయించాలని డిమాండ్ చేయటమంటే ప్రభుత్వంపై బురదచల్లటం తప్ప మరోటికాదు. అవసరమైన టీకాలను సరఫరా చేయమని నరేంద్రమోడిని డిమాండ్ చేసే ధైర్యంలేదు మళ్ళీ. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను కూడా కేంద్రమే నియంత్రిస్తోంది. క్యాబినెట్ సమావేశం అజెండాలో కోవిడ్ 31వ అంశంగా ఉంది కాబట్టి ప్రభుత్వం పట్టించుకోటం లేదని చంద్రబాబు తేల్చేయటం విచిత్రమే.
ప్రతిరోజు జగన్ ఉన్నతాధికారులతో కోవిడ్ గురించి సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అలాంటపుడు అజెండాలో మొదటి అంశమైతే ఏమిటి ? 31వ అంశమైతే ఏమిటి ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపిలో ఎలాంటి పరిస్ధితులున్నాయో ఇంచుమించు ఇలాంటి పరిస్ధితే దేశమంతా ఉంది. కరోనా నియంత్రణ చర్యలు ఏపిలో బాగున్నాయని కేంద్రం అంటుంటే ఫెయిలైందని చంద్రబాబు అనటం రాజకీయం కాకమరేమిటి ?