Begin typing your search above and press return to search.
ప్రైవేటుకు వద్దని.. మీరేమో యశోదాకు వెళితే ఎలా సారూ?
By: Tupaki Desk | 18 May 2021 1:35 AM GMTమాటలు ఎన్నైనా చెప్పొచ్చు. చేతల వరకు వస్తేనే తిప్పలన్ని. పెరిగిపోయిన కొవిడ్ కేసుల నేపథ్యంలో యావత్ దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కేసుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. ఓపక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రజలు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల మీదనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో.. ప్రైవేటు ఆసుపత్రుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటివేళలో రివ్యూ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక వ్యాఖ్య ఒకటి చేశారు. కరోనా చికిత్స కోసం పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లొద్దని.. డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు.. ఆక్సిజన్.. రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో సహా అన్ని అందుబాటులో ఉన్నట్లుగా చెప్పారు. ప్రభుత్వమైనా.. ప్రైవేటు ఆసుపత్రి అయినా చికిత్స విధానం ఒక్కటేనని.. కొవిడ్ చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేరాలని సీఎం కేసీఆర్ కోరుతున్నారు.
అంతాబాగానే ఉంది కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. ఆయన కుమారుడు కేటీఆర్ కానీ.. కుమార్తె కవిత కానీ ఏ రోజైనా సరే.. ఒంట్లో బాగోకపోతే.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారా? మొన్నటికి మొన్న కరోనా వచ్చిన సమయంలోనూ ఫాంహౌస్ లో రెస్టు తీసుకొని.. వైద్య సలహాలు.. సూచనల కోసం సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లారే తప్పించి సర్కారీ ఆసుపత్రికి వెళ్లింది లేదు. పేద ప్రజల్లో నమ్మకాన్ని పెంచటానికి సీఎం సారూ స్వయంగా సర్కారీ ఆసుపత్రికి వెళితే ఆ నమ్మకమే వేరుగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. పేదలంతా సర్కారీ ఆసుపత్రికి వెళ్లాలన్న పిలుపు ఇవ్వటానికి ముందు.. ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులంతా సర్కారీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా తాము మాత్రం కార్పొరేట్ ఆసుపత్రికి.. సామాన్యులు మాత్రం సర్కారీ ఆసుపత్రికి అంటే ఏం బాగుంటుంది చెప్పండి కేసీఆర్?