Begin typing your search above and press return to search.

ఒక్క మ్యాచ్ తో ఎలా.. కోహ్లీ ఆక్రోశం, ఆవేదన

By:  Tupaki Desk   |   25 Jun 2021 6:30 AM GMT
ఒక్క మ్యాచ్ తో ఎలా.. కోహ్లీ ఆక్రోశం, ఆవేదన
X
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు.. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఘోరంగా విఫలమైన బ్యాట్స్ మెన్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త ప్రతిపాదన తీసుకురావడం విశేషం. ఫైనల్ అంటే ఒకటే ఉంటుంది. ఆ ఫైనల్ లో ఒత్తిడిని చిత్తు చేసే ఆటగాళ్లు ఉన్నప్పుడే వారికి విజయం దక్కుతుంది.

తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌంథాప్టన్ పిచ్ పై న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోగా.. భారత బౌలర్లు తేలిపోయారు. భారత బ్యాట్స్ మెన్ క్యూ కట్టగా.. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పోరాడారు. విజయం సాధించారు.

ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ ఆసక్తికరంగా మాట్లాడాడు. ఐసీసీకి కీలక సూచన చేశాడు. అత్యుత్తమ టెస్ట్ ఫైనల్ విన్నర్ ను ఎంపిక చేసేందుకు ఒక్క మ్యాచ్ సరిపోదని అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్ లు నిర్వహించి బాగా ఆడిన వారిని విజేతగా ప్రకటించాలని సూచించాడు. ఒక్క మ్యాచ్ తోనే ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయడాన్ని తాను అంగీకరించబోనని తేల్చిచెప్పాడు. ఫైనల్ లో టెస్ట్ సిరీస్ నిర్వహిస్తే అందులో మూడు మ్యాచ్ లు ఉండాలని పేర్కొన్నాడు. ఆ సిరీస్ లో విజయం సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తే సరిపోతుందన్నారు. ఒక మ్యాచ్ లో ఓడిన జట్టు తర్వాతి మ్యాచ్ లో పుంజుకునే అవకాశం ఉంటుందన్నారు. తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నాడు. భవిష్యత్ లో దీనిపై కసరత్తు చేయాలని సూచించాడు.

అయితే ఇదే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే కోహ్లీ ఇలా అనేవాడా? అని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నాడు. టిమిండియా గెలిచిన మ్యాచ్ లు ఇలా అంటే కోహ్లీ ఏం చేస్తాడని ప్రశ్నించాడు.

ఇక ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోవడం లేదు. కోహ్లీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి పై ట్రెండింగ్ మొదలుపెట్టారు.