Begin typing your search above and press return to search.
మజ్జిగ ప్రజలకు.. మీగడ అంబానీ, అదానీలకా మోడీజీ!?
By: Tupaki Desk | 8 March 2021 11:30 AM GMTప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ప్రైవేటీకరణకు పెద్ద పీట చేస్తూ మొత్తం దేశాన్ని ప్రైవేటీకరణ చేసే ఎత్తుగడ చేస్తోంది. కేవలం పాలించడం వరకు ప్రభుత్వ బాధ్యత అని.. వ్యాపారం చేయడం కాదని మోడీ సార్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన పరిస్థితి. అందుకే నష్టాలు తెస్తున్నా.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోంది.
2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో షాకుల మీద షాకులే ఇచ్చారు. ఓ వైపు ప్రభుత్వ సంస్థలకు మంగళం పాడుతూనే.. బీజేపీ సర్కార్ ప్రైవేటీకరణను అందలం ఎక్కించింది. పలు సంస్థల్లో భారీ స్థాయిలో పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, ఎస్సీఐ, సీసీఐ, హెచ్‌పీసీఎల్, ఐడీబీఐ, బీఈఎంఎల్ సంస్థల ప్రైవేటీకరణపై ప్రకటన చేశారు.
నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ కుండబద్దలు కొట్టారు.
వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని మోడీ మరోసారి స్పష్టం చేశారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించాడు.
అయితే మోడీ వాదన ఎలా ఉన్న దేశంలో కార్మికులు, ప్రజలకు అత్యంత తక్కువగా.. నాణ్యతతో ఇచ్చేవి ప్రభుత్వ రంగ సంస్థలే. వాటిల్లో ఉద్యోగులకు భద్రత, జీతభత్యాలు ఉంటాయి. అదే ప్రైవేటుకు వెళితే ఇవేవీ ఉండవు. వాళ్లు చెప్పిందే ధర.. నిర్ణయించిందే వేతనం.. చాలా దేశాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థలు నడిచి లాభాలు కురిపిస్తున్నవి ఉన్నవి. కానీ మోడీ సార్ మాత్రం భారం పేరుతో వాటిని తెగనమ్మేస్తున్నారు.
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద చర్చ.. దేశంలో ఉన్న అన్ని సంస్థలను మోడీ ప్రభుత్వం తెగనమ్ముకొని అంబానీ, అదానీలకు ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని అంటున్నారు.
ఎవరైనా దీనిపై మాట్లాడితే దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని.. మేధావులు వాపోతున్నారు. ట్యాక్స్ లు ఏమో ప్రజలు కట్టి ఆదాయం మాత్రం అంబానీ, అదానీలకు ఇస్తారని ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. మోడీ సర్కార్ ప్రైవేటైజేషన్ పై విమర్శల వాన కురుస్తోంది.